ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా | Esther Anil Get Tollywood Movie Chance | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత కుమారుడితో 'దృశ్యం' పాప సినిమా

Published Wed, Apr 3 2024 2:26 PM | Last Updated on Wed, Apr 3 2024 2:29 PM

Esther Anil Get Tollywood Movie Chance

మలయాళ నటి ఎస్తర్‌ అనిల్‌. 'దృశ్యం' చిత్రంలో హీరో వెంకటేశ్‌ చిన్న కూతురిగా కనిపించి అందరినీ మెప్పించింది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా మరోసారి కనిపించనుంది. 2020లో ‘జోహార్‌’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘దృశ్యం’ సీక్వెల్‌లోనూ అలరించింది. దీంతో తెలుగు వారికి మరింత దగ్గరైంది.

తాజాగా తెలుగులో హీరోయిన్‌గా ఎస్తర్ అనిల్‌కు మరో ఛాన్స్‌ దక్కింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్  హీరోగా మరో సినిమాతో రానున్నాడు. వీరిద్దరూ జోడిగా ఒక సినిమా రాబోతుంది. విక్రమ్ ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. ఆపై గోలీసోడా అనే కన్నడ సినిమాలో హీరోగా కనిపించాడు.

విక్రమ్‌ కూడా తెలుగులో ఇప్పటికే ఎవడు తక్కువ కాదు, వర్జిన్‌ స్టోరీ వంటి చిన్న చిత్రాలతో ఆయన అలరించాడు. తాజాగా ఎస్తర్‌- విక్రమ్‌ జంటగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉన్నారు. వెంకట కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు.  ప్రొడక్షన్‌ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సుమంత్, సందీప్ కిషన్‌లు ముఖ్య అతిధులుగా హజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement