
మాస్ మహారాజ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రవితేజకు తనయుడు మహాధన్ భూపతి సినీ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది.
గత కొన్నిరోజులుగా మహాధన్ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇడియట్ 2' సీక్వెల్‌తో కొడుకును పరిచయం చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై రవితేజను ప్రశ్నించగా.. ఇలాంటి వార్తలు వినడం ఇదే మొదటిసారి అని, ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని తేల్చిచెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment