Actress Sreeleela Get Series Of Film Opportunities, Check Details Inside - Sakshi
Sakshi News home page

Actress Sreeleela: ఆమె ఫెర్ఫామెన్స్‌కు టాలీవుడ్‌ ఫిదా.. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి

Published Tue, Mar 22 2022 11:41 AM | Last Updated on Tue, Mar 22 2022 1:52 PM

Actress Sreeleela Get Series Of Film Opportunities - Sakshi

మొదటి సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అందుకోవడం..వెంట వెంటనే సినిమా ఆఫర్స్ తలుపు తట్టడం చాలా రేర్ గా జరుగుతుంది. ఇటీవల కాలంలో కృతి శెట్టి మాత్రమే ఇలాంటి ఇమేజ్ అందుకుంది. తెలుగులో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించింది.

ఇప్పుడు కృతి దారిలోనే వెళ్తోంది పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల వెళ్తోంది. పెళ్లి సందడి సినిమా సోసోగా ఆడియానా..ఆమె ఫెర్ఫామెన్స్‌కు టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారు.వరుస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ తన పేరు వినిపించడం కామన్ అయిపోయింది.

ప్రస్తుతం  రవితేజ తో ధమాకాలో కనిపించనుంది.నవీన్ పొలిశెట్టి న్యూ ఫిల్మ్ అనగనగా ఒక రాజు లోనూ నటిస్తోంది.వైష్ణవ్ తేజ్ తో కూడా జోడి కడుతోందని ప్రచారం సాగుతోంది. ఈ మూవీస్ తో పాటు ఇంకా చాలా చిత్రాల్లో శ్రీలీల పేరు వినిపిస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తున్న న్యూ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించనుందట. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటించే చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది.

ఇక వరుస ఆఫర్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోవడంతో.. రెమ్యునరేషన్‌ కూడా పెంచేసిందట ఈ  శాండల్ వుడ్ భామ. ఒక్కో సినిమాకు రూ. కోటి డిమాండ్‌ చేస్తుందట. ఈ భామకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా కోటి అయినా.. ఓకే అంటున్నారట నిర్మాతలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement