కోడలు పిల్లవి తీరే కష్టాలు కావు!
‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ హిట్ అయిన డబ్బింగ్ సీరి యల్స్‌లో ఒకటి. అమాయకురాలైన ఓ కోడలు మహా గడుసుదైన అత్త గారి ఇంట పడే కష్టాలే ఈ సీరియల్. విషయం పాతదే అయినా అందరిళ్లలో జరిగేది కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. దాంతో పండగ చేసుకున్నారు నిర్వా హకులు. అయితే పరిస్థితి ఎలా అయ్యిందంటే... ఆదరిస్తున్నారు కదా అని సీరియల్‌ని సాగదీసు కుంటూ పోతున్నారు. ఇది మన వాళ్ల సమస్య కాదు. ఒరిజినల్‌తోనే ఉంది సమస్య. 2010 మేలో మొద లైంది ‘సాథ్ నిభానా సాథియా’. ఇప్పటికీ కొనసా...గు...తూ...నే... ఉంది. అత్తగారు మారిపోయింది.
కోడల్ని ఆదరించింది. అయినా సీరియల్ ఆగలేదు. కొత్త కొత్త పాత్రలు... కొత్త కొత్త సమస్యలు! తెలుగువారు చూడాల్సిన ట్విస్టులు ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఎంతకీ తీరని కోడలు పిల్ల కష్టాలు మనవాళ్ల మనసుల్ని కలచివేసి కంటతడి పెట్టిస్తాయో లేక వాటిని చూడలేక ఏమిటీ నస అని ఏడిపిస్తాయో చూడాలి!