Original
-
ల్యాబ్‌లో తయారైన డైమండ్ అచ్చమైన వజ్రమేనా?!
ఆభరణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ హవా మొదలైంది. ఆభరణాల్లో పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్ ట్రీట్మెంట్, ఎయిర్΄ోర్ట్ రన్వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్డ్ డైమండ్స్ గురించి మాత్రమే. ఇవి భూమిలోపలి పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్‌లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్ ఓర్ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది. వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్ డైమండ్‌ని, మైన్డ్ డైమండ్‌ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్ కండక్టివిటీ పెన్ టెస్ట్ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్డ్ యూవీ కార్బన్ డాటింగ్ టెస్ట్ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది. క్లారిటీ వర్గీకరణ, కలర్ గ్రేడింగ్, సర్టిఫికేషన్‌లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్‌లో పోల్కీలు కూడా వస్తున్నాయి. సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్ డైమండ్స్ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్. అంటే క్యూబిక్ జెరకాన్స్. సాంకేతిక నామం సీజెడ్స్ అయితే వాటిని మార్కెట్లోకి తెచ్చిన బ్రాండ్ పేరు అమెరికన్ డైమండ్స్. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్ పేర్లతో వ్యవహరిస్తారు. ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్ డైమండ్స్ పొదిగిన ఆభరణాలకు కూడా మైన్డ్ డైమండ్స్ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన సందేహం రీసేల్ వాల్యూ గురించి. ల్యాబ్ డైమండ్స్‌కి కూడా నూటికి నూరుశాతం ఎక్సేంజ్ వాల్యూ, 80 శాతం రీసేల్ వాల్యూ ఉంటుంది.– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ -
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..
జీ20 డిన్నర్లో "ప్రెసిడెంట్ ఆఫ్ భారత్" అన్న పదం రేపిని చిచ్చు మామాలుగా లేదు. అటు రాజకీయ పరంగా ప్రతిపక్షాల మధ్య, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోనూ ఈ అంశం ఓ చర్చనీయాంశంగా మారింది. మన రాజ్యాంగం సైతం ఇండియా అంటే భారత్ అని అర్థం. అని చెబుతున్నా.. ఎందుకిలా చాలమంది ఇండియా అనే పేరు వద్దనుకుంటున్నారు. భారతదేశం అనే పదాన్నీ తమ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసేదిగా 'గర్వంగా ఫీల్వడానికి కారణం ఏంటీ? అసలు భారతదేశాని ఆ పేరు ఎలా వచ్చింది? మన పురాణాల్లో ముఖ్యంగా మన ఋగ్వేదం ఏం చెబుతుంది తదితరాల గురించే ఈ కథనం. భారతదేశం అంటేనే వివిధ మతాల, సంస్కృతుల, ఆచారాల వారసత్వ కలయిక. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతికగా చెబుతుంటారు చరిత్రకారులు. వైవిధ్యాన్ని స్వీకరించే మహోన్నత దేశంగా కీర్తిస్తారు. ప్రాచీన కాలంలో మన దేశాన్ని సంస్కృతంలో "భారత్" లేదా "భరతఖండం" అని పిలిచేవారు. దీని గురించి మన చరిత్రకారులు వివరించి విభిన్న కథలు భారతదేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చిందో సవివరంగా చెబుతున్నాయి. అవేంటో చూద్దాం!. ఋగ్వేదం ప్రకారం... ఋగ్వేదం భారత్‌ని ఏడు నదుల భూమిగా పేర్కొంది. ఋగ్వేదం 18వ శ్లోకం దశరాజ్ఞ లేదా పదిమంది రాజుల భయంకరమైన యుద్ధం కారణంగా "భారతదేశం" అనే పేరు వచ్చిందని చెబుతోంది. ఇంతకీ ఏంటా పదిమంది రాజుల యుద్ధం అంటే..తృత్స రాజవంశంలో భరత తెగకు చెందిన సుదాసు రాజుని పడగొట్టాలని సుమారు పదిమంది రాజులు పన్నాగం పన్నారు. ఫలితంగా పంజాబ్‌లోని రావి నదిపై సుదాసు, ఆ పదిమంది రాజుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాసు రాజు విజయకేతనం ఎగురవేయడంతో .. సుదాసు రాజుకి అమితమైన ప్రజాధరణ లభించింది. ఇదే చివరికి ప్రజలు తమను తాము భరత తెగకు చెందినవారిగా గొప్పగా చెప్పుకునేలా చేసింది. "భరత" అనే పేరు ప్రజల్లో నోళ్లలో స్థిరంగా నిలిచిపోయింది. చివరికి భరత వర్ష అనే పేరుగా మారింది. అనగా..భరతభూమి అని అర్థం. మహాభారతం ప్రకారం.. మహాభారతం ప్రకారం, భరత చక్రవర్తి అనే రాజు పేరు మీద భారతదేశాన్ని భరతవర్ష అని పిలుస్తారని అని మరో కథనం ఉంది. భరత రాజ వంశ స్థాపకుడు అయిన భరతుడు పాండవులు, కౌరవుల పూర్వీకుడు. హస్తినాపుర రాజు దుష్యంతుడు, శకుంతల కుమారుడు కూడా. భరతడు భారతదేశం మొత్తాన్ని జయించాడని అందువల్లే అతని పేరు మీదగా భరతవర్ష లేదా భరత భూమి అని పిలుస్తారని చెబుతారు. అలాగే విష్షుపురాణం ప్రకారం..భరతడుకి రాజ్యాన్ని అప్పగించి అతడి తండ్రి సన్యాసించేందుకు అడువులకు వెళ్లాడని అప్పటిని నుంచే భరతవర్ష అని పిలుస్తారని కూడా అంటారు. భారతదేశం అని ఎలా వచ్చిందో వివరించే పద్యం.. ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణాం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ॥ ఈ పద్యం భావం చూస్తే..ఉత్తరంగా సముద్రం, దక్షిణంగా హిమాలయాలు ఉన్న భూమిని భరత భూమి అని అక్కడ నివశించేవారు భరతడు వారసులని అర్థం. దీన్ని పరిశీలిస్తే భారతదేశం అనే పేరు ప్రాచీన గ్రంథాల నుంచి ఉద్భవించిందని క్లియర్‌గా తెలుస్తోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పూర్వం భారత సామ్రాజ్యం అంటే ప్రసుత పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తుర్క్మెనిస్తాన్, నార్త్-వెస్ట్ టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్‌లు కలిగి ఉన్న దేశం అని అర్థమట. ఇక భరత అనే పదం సంస్కృత పదం. దీని అర్థం అగ్ని. భర అనగా మోసుకెళ్లడం లేదా జ్ఞాన కోసం నిమగ్నమైన వ్యక్తి అని అర్థం అంటే.. జ్ఞానాన్ని సముపార్జించే వాళ్లు అని అర్థం. జైన కథనం ప్రకారం.. మొదటి జైన తీర్థంకరడు పెద్ద కుమారుడు భరత చక్రవర్తి పేరు మీదగా భారతదేశం అని పిలుస్తారని మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. జైనమతం భారత దేశ నాగరికతకు మూలంగా కూడా చెబుతారు చరిత్రకారులు. భారతదేశానికి వివిధ పేర్లు వచ్చిన తీరు.. ఇక సింధు అనే సంస్కృత పదాన్ని ఆంగ్లంలో ఇండస్‌గా వ్యవహరించారు. సింధు పరివాహక ప్రాంతంలో నివశించేవారు కాబట్టి భారతీయులను ఇండియన్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా ఇండియా అని ఏర్పడింది. అలాగే వలసపాలకులు బ్రిటీష్ వారికి ఇలా పిలవడం సులభంగా అనిపించడంతో ఇండియా అనిపేరు స్థిరపడిందని అంటారు. ఇక పర్షియన్ పదం హిందూస్తాన్ అనే పేరుతో కూడా భారతదేశాన్ని పిలిచేవారు. దీని అర్థం హిందువుల భూమి, హైందవ దేశం అని అర్థం. మన దేశం అన్ని మతాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఓ గొప్ప మహోన్నత దేశంగా అలరారుతోంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!) -
Naatu Naatu Song: నాటు నాటు.. ఎందుకంత క్రేజ్!
ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై సగర్వంగా మెరిసింది. అదీ ఒక తెలుగు సినిమా ద్వారా కావడం గమనార్హం. ఏ సినిమా దక్కించుకోని ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గౌరవాన్ని దక్కించుకుందీ రాజమౌళి ఆర్ఆర్ఆర్. నాటు నాటు సాంగ్‌కి గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు. అయితే రాజమౌళి పాన్ ఇండియా రేంజ్లో ట్రిపుల్ ఆర్ మీద విపరీతమైన బజ్ నెలకొన్న టైంలోనూ.. నాటు నాటు రిలీజ్ అయ్యి నెగెటివిటీ చుట్టూరానే తిరిగింది. మరి అది దాటుకుని గ్లోబల్ స్థాయి అవార్డును ఎలా దక్కించుకుందో ఓసారి విశ్లేషిస్తే.. పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు మర్రి సెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు.. నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు ఏం పాట ఇది? నిజంగానే బాహుబలి లాంటి మహత్తర ప్రాజెక్టు తీసిన రాజమౌళి సినిమాలో ఉండాల్సిన రేంజ్ పాటనా ఇది?.. చంద్రబోస్ రాసి రాసి ఎలా రాయాలో మరిచిపోయి ఉంటాడు!. నాటు నాటు అంటూ అర్థం పర్థం లేకుండా రాసేస్తాడా?.. కీరవాణి ఎలాంటి బీట్ కొట్టాడు.. అసలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా. నాటు సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఓ ఇండిపెండెంట్ తెలుగు సీనియర్ జర్నలిస్ట్ తనదైన శైలిలో గుప్పించిన విమర్శలివి. ఈయనొక్కడే కాదు.. చాలా వరకు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్, చివరాఖరికి మీమ్స్ పేజీలు కూడా కూడా నెగెటివ్ రివ్యూలు ఇచ్చాయి ఈ పాటకు. కానీ, టాలీవుడ్లో ఇద్దరు యంగ్ స్టార్లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియొన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి కదా. అందుకే ఆ మూడ్‌కు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్‌ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి లిరిక్స్ రాసిన చంద్రబోస్.. దానికి అంతే సమయం తీసుకుని 30కిపైగా స్వరాలు సమకూర్చారు కీరవాణి. చివరకు ఒక్క ట్యూన్ ఒకే కావడం, యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు గాత్రం అందించడం.. విమర్శలను తొక్కిపారేసి ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. కేవలం ఒకేఒక్క పాట విషయంలోనే రాజమౌళి కనబరిచిన శ్రద్ధ ఇది. అది ఫలించి ఇప్పుడు అవార్డు వరించేలా చేసింది. పాట విజయంలో విజువలైజేషన్స్ ప్రధాన భూమిక పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు నాటు సాంగ్‌కు దక్కిన అవార్డు.. ట్రిపుల్ ఆర్కు దక్కిన భారీ విజయమనే చెప్పొచ్చు. అయితే.. ఈ పాట రిలీజ్ అయినప్పుడు పెదవి విరిచిన వాళ్లూ ఎక్కువే. సాంగ్ ప్రొమో రిలీజ్ అయినప్పుడు కేవలం స్టార్ల అప్పీయరెన్స్ తప్పించి పాట అంతగా ఏం లేదని తేల్చేసిన విశ్లేషకులు కొందరు ఉన్నారు. కానీ, ఆ నెగెటివిటీని తొక్కి పాడేసి గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంది నాటు సాంగ్. మన నాటు సాంగ్‌కు దేశ విదేశాల నుంచి కూడా గుర్తింపు దక్కింది. షార్ట్ వీడియోల ద్వారా ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. సెలబ్రిటీల దగ్గరి నుంచి టీవీ షోలు, ఈవెంట్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ పాట సందడే కనిపించింది. మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నాటు స్టెప్పులకు ఫిదా అయ్యారు జనాలు. షార్ట్ వీడియోస్‌తో అనుకరణకు యత్నించారు. అలా పాటకు దక్కిన పాపులారిటీ మరింతగా విస్తరించింది. 2021, నవంబర్ 10వ తేదీన నాటు నాటు సాంగ్ రిలీజ్(లిరిక్ వెర్షన్) అయ్యింది. సోకాల్డ్ విశ్లేషకుల సంగతి పక్కన పెడితే.. నాటు నాటు సాంగ్ లిజనర్స్‌కు తెగ ఎక్కేసింది. నాటు లిరిక్స్.. నాటు మ్యూజిక్.. దానికి తోడు చెర్రీ-తారక్‌ల సింక్రనైజ్డ్ నాటు స్టెప్పుల బిట్టు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ స్టెప్పు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా.. సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోలేసిన ఆ స్టెప్పు కీలక పాత్ర పోషించింది కూడా. 25 మార్చి 2022న సినిమా రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకులు, అభిమానుల కోలాహలంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చివరకు ఆ పాట సక్సెస్.. సక్సెస్ మీట్లోనూ రాజమౌళి చేత ఆ స్టెప్పు వేయించింది మరి. రికార్డులు.. తెలుగులో నాటు నాటు.. హిందీలో నాచో నాచో, తమిళ్లో నాట్టు కూథూ, కన్నడలో హల్లి నాటు, మలయాళంలో కరినోథల్.. ఇలా భాష ఏదైనా సరే బీట్ ఒక్కటే. ఊపు తెప్పించే స్టెప్పులొక్కటే. అందుకు సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఫుల్ వీడియో సాంగ్.. ఏప్రిల్ 11, 2022లో రిలీజ్ అయ్యింది. నాటు నాటు సాంగ్‌కు అన్ని భాషల్లో కలిపి వ్యూస్ కుమ్మేశాయి. తెలుగులో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న పాట ఇదే. ప్రస్తుతం తెలుగులోనే 140 మిలియన్ వ్యూస్(లిరిక్స్ వెర్షన్‌కి), వీడియో వెర్షన్‌కి 111 మిలియన్ వ్యూస్ దక్కాయి. హిందీ లిరిక్స్ వెర్షన్ 87 మిలియన్ వ్యూస్, వీడియో వెర్షన్‌కి 217 మిలియన్ వ్యూస్ దక్కాయి. 4కే వ్యూస్ ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా అన్ని భాషల్లో అన్ని వెర్షన్లకు కలిపి వంద మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. అలా.. ఒక తెలుగు మాస్ సాంగ్‌కు మిగతా భాషల్లోనూ విపరీతమైన ఆదరణ దక్కింది. గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు సేవులు సిల్లు పడేలాగా కీసుపిట్ట కూసినట్టు ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు ఆర్ఆర్ఆర్లో.. నాటు నాటు సాంగ్ నేపథ్యం ఇంగ్లీషోళ్ల పార్టీలో మన డ్యాన్స్ సామర్థ్యాన్ని హేళన చేయడం నుంచి పుడుతుంది. అక్తర్(భీమ్)కు కలిగిన అవమానం భరించలేక స్నేహితుడైన రామ్.. ఈ మాస్ బీట్‌కు ఆజ్యం పోస్తాడు. అక్తర్‌తో కలిసి ఊర మాస్ స్టెప్పుల మంట రాజేస్తాడు. మన లోకల్ డ్యాన్స్ సత్తా చాటుతారిద్దరూ. పాట వచ్చే సందర్భానికి ఆడియొన్స్ కనెక్ట్ కావడం, అందులో హుషారైన స్టెప్పులు.. ఆయా భాషల్లో లిరిక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగలిగాయి. ఉక్రెయిన్‌లో షూటింగ్ నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది ఎక్కడో తెలుసా? ప్రస్తుతం రష్యా ఆక్రమణతో విలవిలలాడుతున్న ఉక్రెయిన్ గడ్డపై. అవును.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ బయట.. ఆగష్టు 2021లో నాటు నాటు సాంగ్ షూటింగ్ జరిగింది. విశేషం ఏంటంటే.. ట్రిపుల్ ఆర్ సినిమాకు అదే చివరి షెడ్యూల్ కూడా. ఆ సమయంలో మెడలో ఐడీ కార్డు ధరించి ఎన్టీఆర్ జక్కన్న తో ఫొటోను షేర్ చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడి పరిణామాలపై తమకు అవగాహన లేదని, యుద్ధ సమయంలోనే అక్కడి పరిస్థితులు తెలిశాయని దర్శకధీరుడు దిగ్భ్రాంతి సైతం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) రెండు వారాల నరకం.. నాటు నాటు సాంగ్ చిత్రీకరణకు రెండు వారాలకు పైనే పట్టిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పాటలో ప్రేమ్ రక్షిత్ కంపోజిషన్ ప్రకారం.. కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఇద్దరం దాదాపు 15-18 టేక్స్ తీసుకున్నామని స్వయానా తారక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం జక్కన్న నరకం చూపించాడని, మధ్య మధ్యలో డ్యాన్స్ ఆపేసి మరీ చూసేవాడని ఇద్దరూ వాపోయారు(సరదాగా) కూడా. పోనీ.. 18 టేక్స్ తీసుకున్న తర్వాత అందులో ఓకే చేసింది రెండో స్టెప్పు అని, అప్పుడే ఆపేసి ఉంటే అంత కష్టం ఉండేది కాదు కదా అని చెప్పారు కూడా. అయితే.. పర్ఫెక్షన్ కోసమే తాను ఆ పని చేశానంటూ రాజమౌళి వివరణ ఇచ్చుకున్నాడులేండి. భూమి దద్దరయ్యేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఎసెయ్ రో ఏక ఏకి నాటు నాటు నాటు.. అరె దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి నాటు నాటు నాటు నాటు నాటు సాంగ్ రిలీజ్ అయిన తొలినాళ్లలో భయంకరమైన విశ్లేషణలతో ఏకిపడేసినవాళ్లలో కొందరు ఇప్పుడు ఆ పాటను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాట సక్సెస్‌ను జీర్ణించుకోలేని మరికొందరు గప్‌చుప్‌గా ఉండడమో, మరింత విశ్లేషించి విమర్శించడమో చేస్తున్నారు. కానీ, అదే పాట దేశ విదేశాలు దాటుకుని.. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకోగలిగింది. ఆ విజయం వెనుక పాట కోసం కృషి చేసిన ట్రిపుల్ ఆర్ టీం కష్టం ఉంది. ఆ కష్టానికి ఓ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! -
ఆర్ఆర్ఆర్పై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ టీంపై ట్విట్టర్ వేదికగా ప్రసంశల జల్లు కురిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందంటూ నటినటులను, చిత్ర బృందాన్ని పేరుపేరున అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్లో ఈ చిత్ర నటీనటులు, సిబ్బందిని అభినందించారు. మన కళకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడం కంటే మన దేశం గర్వించదగ్గ క్షణం మరోకటి ఉండదు అని అన్నారు. కాగా, రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్లోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. అంతేగాదు ఈ చిత్రం ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయ్యి ఈ అవార్డును గెలుపొందింది. దీంతో ఇప్పటికే పలువురు పలువురు ప్రముఖులు ఆ సినీ చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ సినిమా దక్కించుకోవడం విశేషమైతే, ఆ ఆవార్డును దక్కించకున్న తొలి ఏషియన్ సినిమాగానూ ఆర్ఆర్ఆర్ నిలిచింది. A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE — Narendra Modi (@narendramodi) January 11, 2023 (చదవండి: ఆర్ఆర్ఆర్కు అవార్డు రావడం గర్వంగా ఉంది.. చిత్ర బృందానికి ఏపీ సీఎం జగన్ అభినందనలు) -
తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ మొత్తం ఆర్ఆర్ఆర్ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్ చేశారాయన. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డును దక్కించుకోవడంతో.. ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. -
జీవన సంగీతం
ఒకప్పుడు ఏ ఊరికైనా వెళ్తే, ఆ ఊరు దానికదే ముచ్చటగా కనబడేది. ఆ ఇళ్ల నిర్మాణం, వాటి వాకిళ్లు, వాటి ముందరి చెట్లు, అవి పాకలే అయినా సరే భిన్నంగా ఉండేవి. కలిమిలేముల సమస్య కాదిది. ఈ భూప్రపంచంలో ఆ ఊరిని పోలిన ఊరు ఇంకోటి ఉండకపోయేది. అది దానికదే యునీక్, స్పెషల్. ఇప్పుడు ఏ ఊరిని చూసినా అవే సిమెంటు పౌడరు అద్దుకున్న ముఖాల్లా ఉంటాయి. అంతవరకూ పోనీ అనుకుంటే, ఏ ఊరిలోనైనా ఒకే రకం బ్యానర్లు తగులుతాయి. మనం ఇంకో ఊరికి పోయామన్న అనుభూతే దొరకదు. పోనీ మనుషులను అయినా పలకరిద్దామా అంటే, వాళ్లందరూ ఒకే విషయాలు మాట్లాడుతుంటారు. మనం మన ఊరిలో మాట్లాడే విషయాలే ఆ పక్క ఊరిలో కూడా మాట్లాడుతుంటే వినడం ఎంత విసుగు! ఈ ‘ఒకే రకం’ అనేదే ఇప్పుడు పెద్ద సమస్య. ఏదీ ప్రత్యేకంగా ఉండదు, ఎందులోనూ జీవం తొణికిసలాడదు. నాస్టాల్జియాను కలవరించడంలో అంత దోషమేమీ లేదు. అది మన విలువైన గతం. ప్రపంచంలో ఇలాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అని నమ్మకం కలిగించేట్టుగా ఎవరూ ఉండటం లేదు. అతనూ అదే పాపులర్ సినిమా గురించో, అవే రాజకీయాల గురించో మాట్లాడతాడు. కారణం ఏమంటే, అందరమూ ఒకే రకమైన సమాచారాన్ని డంప్ చేసుకుంటున్నాం. కెరియర్ వరకూ ఏమో గానీ, కరెంట్ ఎఫైర్స్‌లో మాత్రమే జీవితం లేదు. సమాచారం రోజురోజుకూ దొర్లిపోయేది. అందులో జీవిత కాలానికి స్వీకరించగలిగే బరువు ఉండదు. కానీ ప్రపంచమంతా అనుసంధాన మయ్యాక అందరూ చూస్తున్నది ఒకటే, అందరూ చదువుతున్నది ఒకటే. వేరు చూపు లేదు, వేరు ఆలోచన లేదు, వేరుగా దర్శిస్తున్నది లేదు. మొత్తంగా ఒరిజినాలిటీ అనేది లేకుండా పోయింది. అసలు అనుభవాలే భిన్నంగా ఉండకపోయాక ఇంక ఒరిజినాలిటీ ఎక్కyì నుంచి వస్తుంది? కానీ ప్రకృతి మనిషినే కాదు, జీవరాశినే అలా పుట్టించలేదు. ప్రతిదీ దానికదే భిన్నమైనది. ఉదాహరణకు కంచర గాడిదల చర్మాలు జాగ్రత్తగా చూడండి. అన్నీ నలుపూ తెలుపూ చారలే. కానీ ఏ ఒక్క చార కూడా ఇంకో చారను పోలివుండదు. ఏ ఒక్కదాన్ని పోలిన చారలు ఇంకోదానికి ఉండవు. వాటిదైన చర్మపుముద్ర అది! ప్రతి చెట్టు, ఆకు, పువ్వు – ఏ ఒక్కటీ ఒకే రకంగా ఉండవు. కానీ స్థూలంగా అంతా ఒకటే. ఆ సూక్ష్మమైన తేడానే ఎవరికి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కానీ అదే పోగొట్టుకుంటున్నామా అని అనుమానం. ‘‘ప్రతి మనిషికంటూ ఉన్న తనదైన రహస్యం ఏదో మాయమైపోయి, అది కేవలం సమాచారంతో భర్తీ అయిపోయింది. జీవిత రహస్యానికీ, ఈ సమా చారానికీ ఏ సంబంధమూ లేదు. ఈ జీవిత రహస్యం అనేది కొంచెం సంక్లిష్టమైనదీ, సులభంగా అర్థం చేసుకోలేనిదీ. దాని చుట్టూ మనం నర్తించగలం, అబ్బురపడగలం. కానీ అది కిలోబైట్లు, గిగా బైట్ల సమాచారంతో మాత్రం భర్తీ చేసుకోలేనిది’’ అంటారు స్వెత్లానా అలెక్సీవిచ్. చెర్నోబిల్ దుర్ఘ టన, సోవియట్ పతనం, సోవియట్– అఫ్గానిస్తాన్ యుద్ధం లాంటి బీభత్సాల అనంతరం స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరితోనూ స్వెత్లానా మాట్లాడారు. బాధిత జనాల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వెలువరించిన మౌఖిక చరిత్రలకుగానూ రష్యన్ భాషలో రాసే ఈ బెలారూస్ పాత్రికేయురాలు నోబెల్ గౌరవం పొందారు. ‘‘ప్రపంచంలో ఎటు చూసినా ఈ ‘బనాలిటీ’ (ఒరిజినాలిటీ లేకుండా పోవడం) నిండిపోయివుంది. వారిదైన సొంత మాట మాట్లాడేస్థాయికి తేవాలంటే మనుషులలోని దీన్ని ఒలిచెయ్యాలి. అప్పుడు మాత్రమే వాళ్లు అంతకు ముందు ఏ మనిషీ చెప్పలేని మాటలు చెబుతారు. మనుషులను ఆ స్థాయికి తీసుకెళ్లడం నాకు ముఖ్యం’’ అంటారు స్వెత్లానా. అప్పుడు మాత్రమే ‘‘నాకు అది తెలుసని నాక్కూడా తెలియదు’’ అని వాళ్లే ఆశ్చర్యపోతారు. యుద్ధం లేదా అత్యంత విపత్కర పరిస్థితుల్లోనే మనిషి ఉద్వేగమూ, వివేకమూ పైస్థాయికి వెళ్తాయి. విషయం మొత్తాన్నీ చాలా పైచూపుతో చూడగలిగే దృష్టి అలవడుతుంది. ఆ స్థితిలో చేయగలిగే వ్యాఖ్యానం జీవితాన్ని దర్శింపజేస్తుంది. అందుకే ప్రపంచంలో చాలా కళాఖండాలు యుద్ధ ఫలితంగా పుట్టాయి. కానీ గొప్ప కళ సంభవించడం కోసం కల్లోలం జరగకూడదు. కళ కంటే కూడా ఏ కాలంలోనైనా ప్రాణం ముఖ్యం. అందుకే మామూలు జీవితాన్నే మహత్తరంగా మార్చుకో గలగడం తెలియాలి. ‘ఒక పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బతుకుతా’నన్న కవీంద్రులం కావాలి. జీవితంలో నలిగిపోయిన మనిషి మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఆ నలిగిన మనిషి ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు: ఎవరు కాదు? ప్రతి ఒక్కరూ జీవితాన్ని గొప్ప దృష్టితో చూడగలగడానికి అర్హులే అయినప్పుడు మరి అందరూ ‘ఒకే రకం’ అన్న ఫిర్యాదు ఎటుపోయింది? సమాచార బదలాయింపు అనే అర్థంలేని మాటలకే మనం పరిమితమవుతున్నాం కాబట్టి. నిజంగా ఒక లోలోతైన సంభాషణ జరగడానికి అవకాశం ఇస్తున్నామా? మాట్లాడే మనుషులు ఉండటమే కాదు, ఆ మాటలకు అంతేస్థాయిలో ప్రతిస్పందించగలిగేవాళ్లు కూడా ఉన్నప్పుడే గొప్ప సంభాషణలు జరుగుతాయి. సాంకేతికంగా అవి ఎక్కడా రికార్డు కాకపోవచ్చుగాక. కానీ మూకుమ్మడి మానవాళి ఉద్వే గపు సంరంభంలో అజ్ఞాతంగా భాగమవుతాయి. వివేకపు రాశులుగా పోగుపడి మనల్ని వెనకుండి నడుపుతాయి. ఆ జీవన సంగీతం చాలా సున్నితమైనదీ, చెవి నుంచి చెవికి సోకేంత రహస్యమైనదీ, వెన్నెల కింద నానమ్మ పక్కన పడుకుని ఏమీ మాట్లాడకుండానే ఏదో అర్థం చేసుకోవడం లాంటిదీ! ఆ జీవనసంగీతమే ప్రపంచంలో వ్యాపిస్తున్న నిర్హేతుకత, మూర్ఖత్వాలకు జవాబు కాగలదు. -
నమ్మక ద్రోహం... హా.. హా.. హా!!
ఫన్టాస్టిక్ ఏది నకిలీ? ఏది అసలు? ఈ మాయా ప్రపంచంలో కనిపెట్టడం కష్టమే! ప్రతి ఒరిజినల్‌కీ ఒక ఫేక్ పుట్టుకొచ్చేస్తోంది. సృష్టిలో లేనివి మనుషుల మధ్యకు వచ్చి సంచరిస్తున్నాయి. చరిత్రలో లేనివి వర్తమానంలోని పుటలకు ఎక్కేస్తున్నాయి. ఎక్కడా జరగనివి, ఎక్కడో జరిగినట్లుగా, ఎప్పుడో జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి అందమైన, అద్భుతమైన అబద్ధాలు మీ కోసం... నల్ల సింహం వావ్! ప్రకృతి ఎంత వైవిధ్యభరితమైనది?! గుడ్డేం కాదూ. ఈ పక్కన ఉన్న తెల్లసింహానికి కాపీ ఈ నల్ల సింహం. ఫొటోషాప్‌లో వైట్‌ని బ్లాక్ చేశారు. ఓపిగ్గా! అబ్రహాం లింకన్ ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ ఫొటో! అమెరికన్ ప్రెసిడెంటే కదా. ఓ మై దేవుడా! ఈయన ఆయన కాదని అనబోతున్నారా ఏంటి? ఆయనే! కానీ తలకాయ ఒక్కటే లింకన్‌ది. మిగతా బాడీ అంతా జాన్ సి.కాల్హౌస్ అనే పొలిటీషియన్ది. ఫొటోషాప్ రాక ముందే ఈ తలనరికే టెక్నాలజీ వచ్చేసినట్లుంది. లేడీ డయానా! ఎంత డీసెంట్ ఉమెన్. ఇలా చేస్తుందేమిటీ... ఇండీసెంట్‌గా! ఇండీసెంట్ పాపం డయానా కాదు. డయానాలా ఉండే మహిళతో ఇలా వేలు చూపించి ఫొటో తీసినవాడు. బేబీ బంటి ఎంత ముద్దుగా ఉంది! హగ్ చేసుకోవాలనిపిస్తోంది. బేబీ పోలార్ బేర్లు ఇంత బుజ్జిగా ఉంటాయా! ఉండవు. ఇక్కడ బజ్జున్న బాలబంటిలా ఉంటాయి చైనా ట్రాఫిక్ చైనాలో ఇంత ట్రాఫిక్కా! ఫొటో తీసినవాడికి దండాలు. ఫొటో తీసినవాడిక్కాదు, ఫొటోషాపులో చేసిన వాడికి పెట్టండి మీ దండాలు. అది నకిలీ. ఇది రియల్. మార్లిన్ మన్రో మన్రో వెనుక ఉన్నది జాన్ ఎఫ్.కెన్నెడీనే కదా! నో డౌట్. ఆమె నడుము చుట్టూ ఆయన చేతులు. ఆమె తలవంపులో ఆయన తమకాలు! అంత రహస్యమైన ప్రేమ ఇలా ఎలా బయటికి పొక్కిందబ్బా!! పొక్కడం కాదు, పొంగడం కాదు. అసలు వీళ్లిద్దరూ వాళ్లు కానే కాదు. ఆలిసన్ జాక్సన్ అనే ఓ బ్రిటిష్ ఫొటోగ్రాఫర్‌కి ప్రముఖుల పోలికలున్న వాళ్లను పనిగట్టుకుని మరీ ఫోటోలు తీయడం అలవాటు. అలా తీసిన ఫోటోనే ఇది. -
7, 8 తేదీల్లో డైట్ కౌన్సెలింగ్
సంతనూతలపాడు : డీసెట్ (డైట్‌సెట్) సీటు పొందేందుకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7,8 తేదీల్లో మండల పరిధిలోని మైనంపాడు డైట్ కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 140 డైట్ కళాశాలలకు పై రెండు తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 6న ఆన్లైన్లో అలాట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని, వారికి ఇచ్చిన తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలన్నారు. మరిచి పోయామని సాకులు చెబితే సీటు లభించదని తెలిపారు. -
కోడలు పిల్లవి తీరే కష్టాలు కావు!
‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ హిట్ అయిన డబ్బింగ్ సీరి యల్స్‌లో ఒకటి. అమాయకురాలైన ఓ కోడలు మహా గడుసుదైన అత్త గారి ఇంట పడే కష్టాలే ఈ సీరియల్. విషయం పాతదే అయినా అందరిళ్లలో జరిగేది కాబట్టి వెంటనే కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. దాంతో పండగ చేసుకున్నారు నిర్వా హకులు. అయితే పరిస్థితి ఎలా అయ్యిందంటే... ఆదరిస్తున్నారు కదా అని సీరియల్‌ని సాగదీసు కుంటూ పోతున్నారు. ఇది మన వాళ్ల సమస్య కాదు. ఒరిజినల్తోనే ఉంది సమస్య. 2010 మేలో మొద లైంది ‘సాథ్ నిభానా సాథియా’. ఇప్పటికీ కొనసా...గు...తూ...నే... ఉంది. అత్తగారు మారిపోయింది. కోడల్ని ఆదరించింది. అయినా సీరియల్ ఆగలేదు. కొత్త కొత్త పాత్రలు... కొత్త కొత్త సమస్యలు! తెలుగువారు చూడాల్సిన ట్విస్టులు ఇంకా చాలానే ఉన్నాయి. మరి ఎంతకీ తీరని కోడలు పిల్ల కష్టాలు మనవాళ్ల మనసుల్ని కలచివేసి కంటతడి పెట్టిస్తాయో లేక వాటిని చూడలేక ఏమిటీ నస అని ఏడిపిస్తాయో చూడాలి!