7, 8 తేదీల్లో డైట్ కౌన్సెలింగ్
Published Fri, Aug 5 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
సంతనూతలపాడు : డీసెట్ (డైట్‌సెట్) సీటు పొందేందుకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7,8 తేదీల్లో మండల పరిధిలోని మైనంపాడు డైట్ కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 140 డైట్ కళాశాలలకు పై రెండు తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 6న ఆన్‌లైన్‌లో అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వారికి ఇచ్చిన తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలన్నారు. మరిచి పోయామని సాకులు చెబితే సీటు లభించదని తెలిపారు.
Advertisement
Advertisement