Xerox copies
-
మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంచలనం రేపిన ఫోర్జరీ ఎఫ్ఐఆర్ (సృష్టించిన కాపీ) కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. 255/2020 నంబరుతో రెండు ఎఫ్ఐఆర్లు బయటికి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ రోజు స్టేషన్లో జరిగిన మరో ఆసక్తికర పరిణామం పోలీసుల అనుమానాస్పద వైఖరిని బలపరిచేలా ఉందని తెలిసింది. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఎస్సై వ్యవహరించిన తీరు అనుమానాలకు బీజం వేసిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2020 సెప్టెంబరు 9వ తేదీన స్టేషన్‌కు వచ్చిన నల్లగొపు శ్రీనివాస్‌పై ఎఫ్ఐర్ నంబరు 255/2020తో ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని బాధితునికి ఇచ్చారు. అది చూసి కంగారుపడిపోయిన బాధితుడికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు అరెస్టు చేస్తున్నామని, వైద్యపరీక్షలకు సిద్ధంగా ఉండాలని అప్పటి ఎస్సై, సీఐ బాధితుడిని భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరిపోయిన శ్రీనివాసరావు ఇల్లు విక్రయించేందుకు సమ్మతించాడు. దీంతో అరెస్టు చేయడంలేదని, పిలిచినపుడు కోర్టుకు రావాలని ఎస్సై, సీఐలు సూచించడంతో ఎఫ్ఐఆర్ కాపీతో బాధితుడు ఇంటిదారిపట్టాడు. మళ్లీ స్టేషన్‌కి పిలిపించి.. వాసన చూసి బాధితుడు కాపీతో సహా ఇంటికి వెళ్లడంతో కంగారుపడిపోయిన ఎస్సై అతన్ని, ఎఫ్ఐఆర్కాపీని తీసుకురావాల్సిందిగా ఓ వ్యక్తిని పురమాయించాడు. అతడు శ్రీనివాస్‌ని వెంటబెట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ బాధితుడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని హడావుడిగా తీసుకున్న ఎస్సై దాన్ని ముక్కువద్ద పెట్టుకుని వాసన చూశాడు. ఇది చూసి శ్రీనివాసరావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో ఎస్సై... ఏరా..? దీన్ని కార్బన్కాపీ (జిరాక్స్) తీశావా? అని అరిచాడు. ‘అలాంటిదేమీ లేదు’’ అని శ్రీనివాస్ సమాధానమిచ్చాడు. ఆ జవాబు విని ఊపిరిపీల్చుకున్న ఎస్సై.. ఒకవేళ ‘జిరాక్స్ తీసి ఉంటే కొంపలు అంటుకుపోయి ఉండేవి’’ అని వ్యాఖ్యానించాడు. ఎస్సై మాటలతో శ్రీనివాసరావు మనసులో అనుమానం బీజం నాటుకుంది. కానీ, అప్పటికే అతను ఒక కాపీని జిరాక్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఎస్సై కోపం చూసి.. ఆ విషయం అతనితో చెప్పలేకపోయాడు. వాస్తవానికి జిరాక్స్ తీసిన కొద్దిసేపటి వరకు ఆ కాగితాలపై కార్బన్పౌడర్ అంటి ఉంటుంది. తీసిన కొద్దిసేపటి వరకు దాని వాసన చూసి ఆ విషయాన్ని గ్రహించవచ్చు. కానీ, అప్పటికే జిరాక్స్ తీసి చాలాసేపు అవుతుండటంతో ఎఫ్ఐఆర్ కాపీపై కార్బన్ వాసనను ఎస్సై గ్రహించలేకపోయాడు. ఏడాది దాటుతున్నా.. తనను కోర్టుకు పిలవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు శ్రీనివాసరావు ఇటీవల ఓ లాయరును ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఇది చాలా తీవ్ర ఆరోపణ: సీపీ సత్యనారాయణ ఈ కేసులో వచ్చిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఒకే నంబరుపై రెండు ఎఫ్ఐఆర్లు ఉండనే ఉండవు. అందులోనూ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ రద్దు అనేది పూర్తిగా అవాస్తవం. ఆ హక్కులు పోలీసులకు ఉండవు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ఫిర్యాదుదారులు, నిందితులు, సిబ్బందిని పిలిపించాం. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
7, 8 తేదీల్లో డైట్ కౌన్సెలింగ్
సంతనూతలపాడు : డీసెట్ (డైట్‌సెట్) సీటు పొందేందుకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7,8 తేదీల్లో మండల పరిధిలోని మైనంపాడు డైట్ కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 140 డైట్ కళాశాలలకు పై రెండు తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 6న ఆన్లైన్లో అలాట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని, వారికి ఇచ్చిన తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలన్నారు. మరిచి పోయామని సాకులు చెబితే సీటు లభించదని తెలిపారు. -
15 నుంచి ‘కానిస్టేబుల్’ ఈవెంట్స్
పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి ఆగస్టు 6 వరకు ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్‌మన్ విభాగాల్లో అర్హత సాధించిన 1,92,588 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలు, కమ్యూనికేషన్ విభాగంలో అర్హత సాధించిన 27,410 మంది కోసం 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్ల సహాయంతో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి అభ్యర్థులు సమాచార లేఖలు పొందవచ్చని సూచించారు. సమాచార లేఖల్లో పేర్కొన్న విధంగా కేటాయించిన సమయానికి అభ్యర్థులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీలను కచ్చితంగా తీసుకురావాలని పేర్కొన్నారు. వెబ్సైట్ నుంచి సమాచార లేఖలను డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏవైనా ఇబ్బందులు వస్తే 040-23150362, 040-23150462 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు
సమగ్ర కుటుంబ సర్వేపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రతి కార్డుకు జిరాక్సు కాపీ కావాలని అడుగుతుండటంతో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు. అయితే కూకట్పల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమంది ఎన్యుమరేటర్లు సోమవారమే వచ్చి సర్వే పత్రాలు పూర్తి చేసేసి ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కార్డుకు, డాక్యుమెంటుకు సంబంధించి జిరాక్సు కాపీలు కూడా తమకు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నట్లు 'సాక్షి' కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సోమేష్ కుమార్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ ప్రవేశపెట్టాలి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో వివిధ కోర్సుల పరీక్షలు తప్పితే రూ.1000 చెల్లించి పొందే జవాబు పత్రాల కంటే, ఛాలెంజ్ వాల్యుయేషన్‌తోనే మేలు జరుగుతుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. జవాబు పత్రాలు స్వీకరించినా వృథా అవుతుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులకు జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను అందజేసే విధానాన్ని రెండేళ్ల కిత్రం ఓయూ అధికారులు ప్రవేశపెట్టారు. విద్యార్థి తాను రాసిన పరీక్షలో ఏదేని సబ్జెక్టులో ఫెయిల్ అయితే తిరిగి జవాబులను చూసుకునేందుకు రూ.1000 ఫీజును చెల్లిస్తే జవాబు కాపీల జిరాక్స్‌లను అందజేస్తారు. కానీ దీని వలన విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదు. జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను స్వీకరించిన విద్యార్థులు బయటి అధ్యాపకులచే వాల్యుయేషన్ చేయిస్తే గతంలో వచ్చిన మార్కుల కంటే అధికంగా వచ్చినా వర్సిటీ అధికారులు ఆ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. అయితే ఛాలెంజ్ వాల్యూయేషన్ విధానం అమలులో ఉంటే ఎక్కువ వచ్చిన మార్కులను కలిపేవారు. కానీ ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానం లేదు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటే.. ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానంలో విద్యార్థులు తమ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఇతరులతో వాల్యూయేషన్ చేయించి ఓయూ పరీక్షల నియంత్రణ కేంద్రంలో సమర్పిం చాలి. మార్కుల్లో తేడా ఉంటే అధికారులు జవాబు పత్రాలను తిరిగి వాల్యుయేషన్ చేయిస్తారు. గతంలో వచ్చిన మార్కుల కంటే అదనంగా వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో విద్యార్థికి మేలు జరిగి మార్కుల సంఖ్య పెరిగి ఉత్తీ ర్ణులయ్యే అవకాశం ఉంది. కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్‌పై ఓయూ అధికారులు అశ్రద్ధ చేయడంతో ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇతర వర్సిటీల మాది రిగా ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానాన్ని ఓయూలో ప్రవేశపెట్టాలని విద్యార్థులు, వారి తల్లిందడ్రులు కోరుతున్నారు.