ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో వివిధ కోర్సుల పరీక్షలు తప్పితే రూ.1000 చెల్లించి పొందే జవాబు పత్రాల కంటే, ఛాలెంజ్ వాల్యుయేషన్‌తోనే మేలు జరుగుతుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. జవాబు పత్రాలు స్వీకరించినా వృథా అవుతుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులకు జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను అందజేసే విధానాన్ని రెండేళ్ల కిత్రం ఓయూ అధికారులు ప్రవేశపెట్టారు. విద్యార్థి తాను రాసిన పరీక్షలో ఏదేని సబ్జెక్టులో ఫెయిల్ అయితే తిరిగి జవాబులను చూసుకునేందుకు రూ.1000 ఫీజును చెల్లిస్తే జవాబు కాపీల జిరాక్స్‌లను అందజేస్తారు.
కానీ దీని వలన విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదు. జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను స్వీకరించిన విద్యార్థులు బయటి అధ్యాపకులచే వాల్యుయేషన్ చేయిస్తే గతంలో వచ్చిన మార్కుల కంటే అధికంగా వచ్చినా వర్సిటీ అధికారులు ఆ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. అయితే ఛాలెంజ్ వాల్యూయేషన్ విధానం అమలులో ఉంటే ఎక్కువ వచ్చిన మార్కులను కలిపేవారు. కానీ ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానం లేదు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటే..
ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానంలో విద్యార్థులు తమ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఇతరులతో వాల్యూయేషన్ చేయించి ఓయూ పరీక్షల నియంత్రణ కేంద్రంలో సమర్పిం చాలి. మార్కుల్లో తేడా ఉంటే అధికారులు జవాబు పత్రాలను తిరిగి వాల్యుయేషన్ చేయిస్తారు. గతంలో వచ్చిన మార్కుల కంటే అదనంగా వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో విద్యార్థికి మేలు జరిగి మార్కుల సంఖ్య పెరిగి ఉత్తీ ర్ణులయ్యే అవకాశం ఉంది. కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్‌పై ఓయూ అధికారులు అశ్రద్ధ చేయడంతో ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇతర వర్సిటీల మాది రిగా ఛాలెంజ్ వాల్యుయేషన్ విధానాన్ని ఓయూలో ప్రవేశపెట్టాలని విద్యార్థులు, వారి తల్లిందడ్రులు కోరుతున్నారు.
ఓయూలో ఛాలెంజ్ వాల్యుయేషన్ ప్రవేశపెట్టాలి
Published Sun, Jun 15 2014 12:45 AM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM
Advertisement
Advertisement