సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు | xerox copies need not be given in survey, says ghmc commissioner | Sakshi
Sakshi News home page

సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు

Published Mon, Aug 18 2014 12:02 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు

సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు

సమగ్ర కుటుంబ సర్వేపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రతి కార్డుకు జిరాక్సు కాపీ కావాలని అడుగుతుండటంతో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు.

అయితే కూకట్పల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమంది ఎన్యుమరేటర్లు సోమవారమే వచ్చి సర్వే పత్రాలు పూర్తి చేసేసి ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కార్డుకు, డాక్యుమెంటుకు సంబంధించి జిరాక్సు కాపీలు కూడా తమకు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నట్లు 'సాక్షి' కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సోమేష్ కుమార్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement