intensive survey
-
'హైదరాబాద్‌ను విశ్వనగరం ఎలా చేస్తారు'
హైదరాబాద్ : రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ రేషన్ కార్డుల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోమనడం సమంజమా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులపై సభలో నిలదీస్తే ప్రభుత్వం ఎందుకు తప్పించుకోవాలనుకుంటోందని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ పేద వర్గాల రేషన్ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. సంక్షేమ పథకాలకే సమగ్ర సర్వే అని రేషన్ కార్డులు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎలుకల కోసం ఇల్లు తగులపెట్టినట్లుగా ఎక్కడో బోగస్ కార్డులున్నాయని అందరినీ దరఖాస్తు చేసుకోమనడం సమంజసమా అని అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని గతంలో ఉన్న రీయింబర్స్మెంట్ తొలగించారని, అనారోగ్యంతో ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్తే రీయింబర్స్మెంట్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాల కారణంగా రోడ్లు జలమయం అవుతుంటే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా ఎలా తీర్చిదిద్దుతారని లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. చిన్నపాటి వర్షానికే నగరం జలమయం అవుతోందని ఆయన ఆరోపించారు. -
'సమగ్ర సర్వేను ప్రధాని సైతం మెచ్చుకున్నారు'
హైదరాబాద్: తెలంగాణ స్థితిగతులు తెలుసుకునేందుకే సమగ్ర సర్వే నిర్వహించినట్లు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం...భవిష్యత్ ప్రణాళిక నిర్దేశించుకునేందుకు సర్వే చేసినట్లు ఆయన అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో విపక్షాలు లేవనెత్తిన ఆరోపణలకు ఈటెల సమాధానమిచ్చారు. సంకుచిత ఆలోచనతో సమగ్ర సర్వే జరగలేదని... ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారన్నారు. విపక్షాలు మంచిని ప్రశంసించాల్సిందిపోయి విమర్శలు చేయటం తగదన్నారు. సర్వే వల్ల తెలంగాణలో పండుగ వాతావరణం, సమైక్య భావన, మానవ సంబంధాలు పెంపొందాయని ఈటెల అన్నారు. వైషమ్యాలతో రగిలే కుటుంబాలు కూడా ఈ సర్వేలో కలిసిపోయాయని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో అనర్హులను ఏరివేసేందుకే సర్వే నిర్వహించినట్లు తెలిపారు. -
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు
-
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కోసం ఆ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా సమగ్ర సర్వేపై రామ్మోహన్ చౌదరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వే వివరాల డేటా ఎంట్రీ పనులను ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించారని, దీనివల్ల వ్యక్తిగత సమాచారం బయట వ్యక్తులకు వెళుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సమగ్ర సర్వే గుట్టు విప్పిన కేసీఆర్!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సమగ్ర సర్వే గుట్టు విప్పారు. గత నెల 19న తెలంగాణవ్యాప్తంగా సమగ్రసర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా పరుగు... పరుగున వచ్చి ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఇంతకీ సమగ్ర సర్వే ఎందుకంటే.. ప్లానింగ్ కమిషన్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగానే కేసీఆర్ ఈ సర్వే చేయించినట్లు సమాచారం. కేసీఆర్‌ను ప్లానింగ్ కమిషన్ అడిగిన ఓ ప్రశ్నకు... ఆయన షేమ్‌గా ఫీలయ్యారట. తెలంగాణలో ఎక్కువ మంది వికలాంగులు ఎందుకు ఉన్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సీఎంగారు సమాధానం చెప్పలేకపోయారట. దాంతో హైదరాబాద్ వచ్చిన ఆయన ఫించన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల విషయంలో బోగస్‌లను ఎత్తివేసి అసలైన లబ్దిదారులను గుర్తించేలా...సర్వే చేపట్టాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ ... 'ప్లానింగ్ కమిషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నేను చాలా అవమానపడ్డాను. కించపరిచేలా ప్రశ్నించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా పట్టిష్టమైన సర్వే చేపట్టేందుకు టైమ్ వచ్చింది' అన్నారట. దాని ఎఫెక్టే 'సమగ్ర కుటుంబ సర్వే' అట. మరోవైపు సమగ్ర సర్వేలో తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ మరో సర్వేకి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రేపు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సర్వేకు హైకోర్టు సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వేపై దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందిస్తూ ఇప్పటికిపుడు సమగ్ర సర్వేపై స్టే విధించలేమని పేర్కొంది. సర్వే మార్గదర్శకాలపై జీవో నంబర్ 50లో ప్రభుత్వం అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నదని వెల్లడించింది. కాగా సంక్షేమ పథకాలను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. సుమారు 3.76 లక్షల మంది ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) ఒకేరోజులో ఈ సర్వేను నిర్వహించనున్నారు. -
సీమాంధ్రులను వెళ్లగొట్టడానికేనా?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అసలు ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన దాదాపు 55 వేల మంది ఉద్యోగులు, లక్ష మంది విద్యార్థులను ఈ నగరం నుంచి పంపేయడమేనా? సర్వే అసలు ఉద్దేశం ఇదేనంటూ స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో పీఆర్వోగా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక వీడియోను తెలుగుదేశం పార్టీ సేకరించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో హల్చల్ చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వేము నరేందర్ రెడ్డి ఈ వీడియోను విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం పీఆర్వో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి. ఇలా సవాలక్ష సందేహాలు, అనుమానాల నడుమ తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే మంగళవారం జరగబోతోంది. ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. వివరాల వెల్లడి విషయంలో ఏదీ తప్పని సరి కాదని, నిర్బంధమేమీ లేదని తెలిపింది. మరోవైపు అన్ని వివరాలు ఇస్తేనే ప్రభుత్వం నుంచి లబ్ధి వస్తుందని స్పష్టం చేసింది. ఇది బేస్‌లైన్ సర్వే అని పేర్కొంది. -
సర్వేలో జిరాక్సు కాపీలేవీ ఇవ్వక్కర్లేదు
సమగ్ర కుటుంబ సర్వేపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రతి కార్డుకు జిరాక్సు కాపీ కావాలని అడుగుతుండటంతో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు. అయితే కూకట్పల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమంది ఎన్యుమరేటర్లు సోమవారమే వచ్చి సర్వే పత్రాలు పూర్తి చేసేసి ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కార్డుకు, డాక్యుమెంటుకు సంబంధించి జిరాక్సు కాపీలు కూడా తమకు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నట్లు 'సాక్షి' కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సోమేష్ కుమార్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.