సీమాంధ్రులను వెళ్లగొట్టడానికేనా? | survey intended to send seemandhra people, claims video | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులను వెళ్లగొట్టడానికేనా?

Published Mon, Aug 18 2014 1:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

సీమాంధ్రులను వెళ్లగొట్టడానికేనా? - Sakshi

సీమాంధ్రులను వెళ్లగొట్టడానికేనా?

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అసలు ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన దాదాపు 55 వేల మంది ఉద్యోగులు, లక్ష మంది విద్యార్థులను ఈ నగరం నుంచి పంపేయడమేనా? సర్వే అసలు ఉద్దేశం ఇదేనంటూ స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో పీఆర్వోగా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక వీడియోను తెలుగుదేశం పార్టీ సేకరించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వేము నరేందర్ రెడ్డి ఈ వీడియోను విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం పీఆర్వో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి.

ఇలా సవాలక్ష సందేహాలు, అనుమానాల నడుమ తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే మంగళవారం జరగబోతోంది. ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. వివరాల వెల్లడి విషయంలో ఏదీ తప్పని సరి కాదని, నిర్బంధమేమీ లేదని తెలిపింది. మరోవైపు అన్ని వివరాలు ఇస్తేనే ప్రభుత్వం నుంచి లబ్ధి వస్తుందని స్పష్టం చేసింది. ఇది బేస్‌లైన్ సర్వే అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement