సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రేపు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సర్వేకు హైకోర్టు సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వేపై దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందిస్తూ ఇప్పటికిపుడు సమగ్ర సర్వేపై స్టే విధించలేమని పేర్కొంది. సర్వే మార్గదర్శకాలపై జీవో నంబర్ 50లో ప్రభుత్వం అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నదని వెల్లడించింది.
కాగా సంక్షేమ పథకాలను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. సుమారు 3.76 లక్షల మంది ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) ఒకేరోజులో ఈ సర్వేను నిర్వహించనున్నారు.