ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేయగా, సెన్సెక్స్ కూడా అదేబాటలో పయనించింది. అతేకంఆదు అల్ టైం రికార్డ్ 30,000వైపు దూసుకుపోతోంది. సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో 29,910వద్ద ముగియగా, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 9237వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డ్ స్థాయిలవద్ద, ప్రధానంగా నిఫ్టీ తొలిసారి 92వందల స్థాయిని తాకడం విశేషం.
ఒక్కఐటీ మినహా దాదాపు అన్ని రంగాలు లాభపడగా, రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ 1.4-0.5 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్, ఎల్ అండ్ టీ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. భారతి ఎయిర్ టెల్, విప్రో, బీపీసీఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజాలతోపాటు డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఏసీసీ లాభపడగా, ఐవోసీ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోయాయి.
మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా మంగళవారం(4న) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లో ట్రేడింగ్ మళ్లీ బుధవారం(5న) యధావిధిగా మొదలుకానుంది.