
సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా తొలిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది. సౌదీ అరేబియా చమురు నుండి దూరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను విస్తృతం చేసే ప్రయత్నంలో భాగంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలపై వినాశకరమైన దాడులు జరిగిన రెండు వారాల తరువాత ఈ ప్రకటన రావడం విశేషం.
చమురు బావులపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడుల్లో ఆ దేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోవాలని సౌదీ సర్కార్ యోచిస్తోంది. "అంతర్జాతీయ పర్యాటకులను సౌదీ అరేబియాకు ఆహ్వానించడం తమ దేశానికి సంబంధించిన దొక చారిత్రాత్మక క్షణం" అని పర్యాటక చీఫ్ అహ్మద్ అల్-ఖతీబ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే విదేశీ మహిళల కోసం రాజ్యం తన కఠినమైన దుస్తుల నియమావళిని కూడా సులభతరం చేస్తుందని, సౌదీ మహిళలకు ఇప్పటికీ బహిరంగ దుస్తులు ధరించే శరీర కవచం లేని అబయ వస్త్రాన్ని లేకుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని ఖతీబ్ చెప్పారు. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి సౌందర్యం, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment