
ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్ అందాల రాశి. సిల్వర్ స్క్రీన్ కోసం ఆమె మేకప్ వేసుకొని నాలుగేళ్లైంది. ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తన కుమార్తె ఆరాధ్య స్కూల్‌కు వెళుతోంది. ఐష్‌కు తీరిక చిక్కింది. అందుకే మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమవుతోంది. అదీ ఇంతకు ముందు ఎప్పుడూ పోషించని పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. న్యాయవాదిగా నల్లకోటు వేసుకొని కోర్టులోకి ఎంట్రీకానుంది. ఐష్ న్యాయవాదిగా నటించడం ఇదే ఫస్ట్ టైమ్.
సంజయ్ గుప్తా రూపొందిస్తున్న సినిమాలో ఐశ్వర్య రాయ్ ఓ పవర్పుల్ న్యాయవాది పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి 'జస్‌బా' అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఐష్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా కనిపించనుంది. ఇందులో ఐష్కు జోడీగా ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇర్ఫాన్ది ఈ చిత్రంలో సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఈ సినిమాలో జాన్ అబ్రహామ్ కూడా నటిస్తున్నారు.