నాగ్ సరసన ఐష్..కాదు అశిన్ | Nag and Asin in Maniratnam Movie | Sakshi
Sakshi News home page

నాగ్ సరసన ఐష్..కాదు అశిన్

Published Sat, Mar 29 2014 4:16 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ సరసన ఐష్..కాదు అశిన్ - Sakshi

నాగ్ సరసన ఐష్..కాదు అశిన్

తెలుగు-తమిళ ద్విభాషా  మల్టీస్టారర్ చిత్రం - అగ్ర దర్శకుడు మణిరత్నం - అయినా హీరోయిన్ మారిపోయింది. చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా, భారీ మల్టీస్టారర్ చిత్రం అయినా, ఎంతటి దర్శకుడైనా, ఎంతటి హీరోయిన్ అయినా ముందు అనుకున్న వారు ఆ తరువాత మారిపోవడం సహజమైపోయింది. దర్శకుడికి నచ్చకపోయినా, హీరోకి నచ్చకపోయినా హీరోయిన్ మారిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయినే నో చెప్పినట్లు తెలుస్తోంది.

మాజీ ప్రపంచం సుందరి, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యారాయ్ మణి రత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువర్ (1997) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు.  అటువంటి మణిరత్నం  దర్శకత్వం  వహించే చిత్రంలో నటించాలన్న ప్రపోజల్కు ఆమె నో చెప్పారని సమాచారం.

అందాల తార  ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్పై కనిపించి కనువిందు చేస్తుందని అందరూ ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశతో ఎదురు చూశారు. అదీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన కనిపించబోతోందని మన ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మణిరత్నం డైరెక్ట్ చేయబోతోన్న మల్టీస్టారర్ మూవీలో నాగ్కు జోడీగా ఐష్ నటింస్తుందని వార్తలొచ్చాయి. కానీ, ఈ ప్రపోజల్కు ఐష్ నో చెప్పినట్లు తెలుస్తోంది.  ఐష్ అందాల్ని చూద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది.

తెలుగులో మళ్లీ మల్టీస్టార్ల యుగం మొదలైంది. గతంలో ఎన్టీఆర్-అక్కినేని,  ఎన్టీఆర్-కృష్ణ, ఎన్టీఆర్- మోహన్ బాబు, కృష్ణ-శోభన్ బాబు, అక్కినేని-కృష్ణ....ఇలా ఎన్నో చిత్రాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. ఆ తరువాత చాలాకాలం మల్టీస్టార్ల చిత్రాలు రాలేదు. ఇటీవల వెంకటేష్-మహేష్ బాబు నటించిన  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేశ్-రామ్  మసాలా,  అల్లు అర్జున్, రాం చరణ్ ‘ఎవడు’ చిత్రాలు వచ్చాయి.  తాజాగా తమిళంలో అగ్ర దర్శకుడైన మణిరత్నం దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్లు అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు కాంబినేషన్లో  తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది.  ఈ భారీ మూవీ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఐతే ఇందులో నాగ్ సరసన అశిన్ నటించే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సమాచారం.  గతంలో అశిన్ నాగ్తో శివమణి మూవీలో నటించింది. మళ్లీ ఇంతకాలం తరువాత వీరిద్దరి జోడీ రిపీట్ కాబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement