Mani Ratnam Said He Used to Scold Aishwarya Rai and Trisha in Set - Sakshi
Sakshi News home page

Mani Ratnam: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం

Published Mon, Sep 26 2022 1:35 PM | Last Updated on Mon, Sep 26 2022 3:18 PM

Mani Ratnam Said He Used to Scold Aishwarya Rai and Trisha in Set - Sakshi

దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. పాన్‌ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆయన సెట్స్‌లో కొన్నిసార్లు స్టార్‌ హీరోయిన్స్‌ అయిన ఐశ్వర్యరాయ్‌, త్రిషలపై సీరియస్‌ అయ్యానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

చదవండి: జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘ఆది’ రీరిలీజ్‌! ఎప్పుడంటే..

షూటింగ్‌ సమయంలో త్రిష, ఐశ్యర్యరాయ్‌లతో కాస్తా ఇబ్బంది పడ్డానని, అందుకే వారిపై పలుమార్లు అరిచానన్నారు.‘ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్యల సన్నివేశాలు, డైలాగ్స్‌ సీరియస్‌గా కొనసాగుతాయి. షూటింగ్‌ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌నెస్‌ వచ్చేది కాదు. దానికి కారణం సెట్స్‌లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. అందువల్ల వారి సీన్స్‌ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్‌ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్టు సీన్స్‌ వచ్చేవి కాదు. వాటికి చాలా టైం పట్టేది. దీంతో సినిమా అయిపోయేవరకు వారిని మాట్లాడుకోవద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చాను. 

చదవండి: అప్పుడే ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

అయినా వారు వినకపోవడంతో కొన్నిసార్లు ఇద్దరిని ఇద్దరిపై కోప్పడాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, హీరో కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభితా ధూలిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన.  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement