multi star movie
-
ఇండియా లో ఉన్న హీరోలు అంతఈ సినిమాలో ఉన్నారుగా..
-
ముహూర్తం ఫిక్స్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్ 2’, బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో ఓ మల్టీ స్టార్ మూవీకి ఓకే చెప్పారు వెంకటేశ్. ఇలా వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాల తర్వాత సోలో హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ ఓకే చేశారు వెంకీ. ఇది వరకూ వెంకీ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ వెంకటేశ్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా ముహూర్తాన్ని డిసెంబర్లో ఫిక్స్ చేశారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్‌ను 2019 జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
నాగ్ సరసన ఐష్..కాదు అశిన్
తెలుగు-తమిళ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రం - అగ్ర దర్శకుడు మణిరత్నం - అయినా హీరోయిన్ మారిపోయింది. చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా, భారీ మల్టీస్టారర్ చిత్రం అయినా, ఎంతటి దర్శకుడైనా, ఎంతటి హీరోయిన్ అయినా ముందు అనుకున్న వారు ఆ తరువాత మారిపోవడం సహజమైపోయింది. దర్శకుడికి నచ్చకపోయినా, హీరోకి నచ్చకపోయినా హీరోయిన్ మారిపోవడం తరచూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయినే నో చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ ప్రపంచం సుందరి, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యారాయ్ మణి రత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువర్ (1997) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. అటువంటి మణిరత్నం దర్శకత్వం వహించే చిత్రంలో నటించాలన్న ప్రపోజల్‌కు ఆమె నో చెప్పారని సమాచారం. అందాల తార ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించి కనువిందు చేస్తుందని అందరూ ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశతో ఎదురు చూశారు. అదీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన కనిపించబోతోందని మన ప్రేక్షకులు తెగ ఆనందపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మణిరత్నం డైరెక్ట్ చేయబోతోన్న మల్టీస్టారర్ మూవీలో నాగ్‌కు జోడీగా ఐష్ నటింస్తుందని వార్తలొచ్చాయి. కానీ, ఈ ప్రపోజల్‌కు ఐష్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐష్ అందాల్ని చూద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది. తెలుగులో మళ్లీ మల్టీస్టార్ల యుగం మొదలైంది. గతంలో ఎన్టీఆర్-అక్కినేని, ఎన్టీఆర్-కృష్ణ, ఎన్టీఆర్- మోహన్ బాబు, కృష్ణ-శోభన్ బాబు, అక్కినేని-కృష్ణ....ఇలా ఎన్నో చిత్రాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. ఆ తరువాత చాలాకాలం మల్టీస్టార్ల చిత్రాలు రాలేదు. ఇటీవల వెంకటేష్-మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేశ్-రామ్ మసాలా, అల్లు అర్జున్, రాం చరణ్ ‘ఎవడు’ చిత్రాలు వచ్చాయి. తాజాగా తమిళంలో అగ్ర దర్శకుడైన మణిరత్నం దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్లు అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు కాంబినేషన్లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ భారీ మూవీ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఐతే ఇందులో నాగ్ సరసన అశిన్ నటించే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సమాచారం. గతంలో అశిన్ నాగ్‌తో శివమణి మూవీలో నటించింది. మళ్లీ ఇంతకాలం తరువాత వీరిద్దరి జోడీ రిపీట్ కాబోతోంది. -
టేస్టీగా మసాలా రెడీ
వెంకటేష్, దర్శకుడు కె.విజయభాస్కర్ ఇద్దరూ నవ్వించడంలో సిద్దహస్తులే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో అలరించాయి. ముచ్చటగా మూడో సారి వీరిద్దరూ కలిసి పనిచేయడం ఓ విశేషం అయితే, వీరితో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తోడవ్వడం మరో విశేషం. ఈ ముగ్గురు కలిసి నూరే మల్టీస్టారర్ ‘మసాలా’ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా! అంజలి హొయలు... షాజన్ పదమ్సీ తళుకులు ఈ ‘మసాలా’కు అదనపు ఆకర్షణలు. ఇటీవలే వెంకటేష్, రామ్, కోవై సరళ, జయప్రకాష్‌రెడ్డి, అలీపై చిత్రీకరించిన మసాలా రీమిక్స్ సాంగ్‌తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ వచ్చే నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వెంకటేష్ ఇందులో దాదాగా నటిస్తున్నారు. ఆయన పాత్ర తీరు తెన్నులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఆహార్యంలోనూ, వాచకంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకొని వెంకటేష్ ఈ పాత్ర పోషించారు. అభిమానులనే కాక, ప్రతి ఒక్కరినీ ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. రామ్ పాత్ర కొత్తగా ఉంటుంది. అతని పాత్రలో భిన్న కోణాలుంటాయి. నటునిగా రామ్‌ని మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా తప్పకుండా అందరినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అని ‘స్రవంతి’ రవికిషోర్ అన్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిదని, రెండున్నర గంటల పాటు చక్కని టైమ్‌పాస్ అని దర్శకుడు విజయభాస్కర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్‌శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.