ముహూర్తం ఫిక్స్‌? | Victory Venkatesh Trivikram SrinivasFilm Launch Plan | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఫిక్స్‌?

Published Mon, Jun 4 2018 12:39 AM | Last Updated on Mon, Jun 4 2018 12:39 AM

Victory Venkatesh Trivikram SrinivasFilm Launch Plan - Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌తో ‘ఎఫ్‌ 2’, బాబీ డైరెక్షన్‌లో నాగ చైతన్యతో ఓ మల్టీ స్టార్‌ మూవీకి ఓకే చెప్పారు వెంకటేశ్‌. ఇలా వరుసగా రెండు మల్టీస్టారర్‌ చిత్రాల తర్వాత సోలో హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ ఓకే చేశారు వెంకీ. ఇది వరకూ వెంకీ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి హిట్‌ సినిమాలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ అందించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాతో ఫస్ట్‌ టైమ్‌ వెంకటేశ్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నారు త్రివిక్రమ్‌. ఈ సినిమా ముహూర్తాన్ని డిసెంబర్‌లో ఫిక్స్‌ చేశారని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ను 2019 జనవరి నుంచి స్టార్ట్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై యస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement