తాగుబోతులా నా గురించి మాట్లాడేది | Clark spoke for the first timem leveled criticis | Sakshi
Sakshi News home page

తాగుబోతులా నా గురించి మాట్లాడేది

Published Fri, Nov 20 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

తాగుబోతులా నా గురించి మాట్లాడేది

తాగుబోతులా నా గురించి మాట్లాడేది

తనపై వచ్చిన విమర్శలపై తొలిసారి మాట్లాడిన క్లార్క్

 సిడ్నీ: యాషెస్ సిరీస్ ఓటమితో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలిసారి మౌనం విడాడు. తనపై వచ్చిన విమర్శలపై చాలా ఘాటుగా స్పందించాడు. యాషెస్ సిరీస్ పరాజయాల నేపథ్యంలో తన నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించిన మాజీలు సైమండ్స్, హేడెన్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాగి దేశానికి ఆడిన వ్యక్తి తన కెప్టెన్సీ గురించి మాట్లాడతాడా? అంటూ సైమోపై ధ్వజమెత్తాడు. ‘నా నాయకత్వాన్ని అంచనా వేసే స్థాయి సైమండ్స్‌కు లేదు. తాగినోడు నాపై రాళ్లు వేస్తే చూస్తూ ఉండాలా’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేయడానికి క్లార్క్ నిరాకరించేవాడని, బలవంతంగా హెల్మెట్ అప్పగిస్తే బ్యాగీ గ్రీన్‌ను వెనక్కి ఇచ్చేస్తానని పాంటింగ్‌ను బెదిరించేవాడని అప్పట్లో హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తన రికార్డులు వీటికి సమాధానం చెబుతాయని క్లార్క్ స్పందించాడు. ‘గత 12 ఏళ్లుగా నా విలువేంటో అందరికి తెలిసింది. దేశానికి ఎంత పేరు తెచ్చానో అందరూ చూశారు. నేను ఆడిన మ్యాచ్‌లే నేనేంటో నిరూపిస్తున్నాయి. ఒకవేళ పాంటింగ్ హర్బర్ బ్రిడ్జిపై నుంచి దూకమంటే మారుమాట్లాడకుండా దూకేస్తా. ఆసీస్‌కు ఆడటం నాకు ఇష్టం. దానికోసం ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉండేవాణ్ని’ అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు.

 కుక్క కూడా కోచింగ్ చేయగలదు..
 తన నాయకత్వంలో ఆసీస్ జట్టు సంస్కృతి పూర్తిగా చెడిపోయిందని వ్యాఖ్యానించిన బుకానన్‌పై క్లార్క్ విమర్శలు గుప్పించాడు. ‘జాన్‌కు బ్యాగీ గ్రీన్ గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని అతనెప్పుడూ ధరించలేదు. బుకానన్ నిజాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. అతని వల్లే ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం వచ్చిందనుకుంటున్నాడేమో... నా కుక్క కోచింగ్ ఇచ్చినా అంతే ఆధిపత్యం చూపెట్టేవాళ్లం. జట్టు సంస్కృతి భిన్నంగా ఉండాలని స్టీవ్ వా, గిల్‌క్రిస్ట్, పాంటింగ్‌లు ప్రయత్నించారు. కానీ నా హయాంలో ఇది కాస్త తగ్గింది. రానురాను మరింతగా మారిపోయింది. ఇది నన్ను చాలా నిరాశకు గురిచేసింది’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement