స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్‌సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి.
ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది.
1971లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్‌సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ.
Comments
Please login to add a commentAdd a comment