successful trial
-
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ప్రయోగం సక్సెస్
బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ రెండవ ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని, మొదటి సారి తలెత్తిన సమస్యలేవీ ఇప్పుడు ఎదురుకాలేదని కంపెనీ తెలిపింది.న్యూరాలింక్ మొదటి ఇంప్లాంట్‌ను నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి గత జనవరిలో అమర్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఇంప్లాంట్‌కు సంబంధించిన అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోడ్ వైర్లు మెదడు నుంచి బయటకు వచ్చాశాయి. ఫలితంగా మెదడు సంకేతాలను అంచనా వేయడంలో సమస్య ఏర్పడింది. తర్వాత దీన్ని పరిష్కరించినట్లు న్యూరాలింక్ పేర్కొంది. కాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లోనే న్యూరాలింక్‌కు ఈ సమస్య గురించి తెలుసని రాయిటర్స్ నివేదించింది.ఇలాంటి సమస్య రెండవ రోగిలో పునరావృతం కాకుండా నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో మెదడు కదలికను తగ్గించడంతోపాటు ఇంప్లాంట్, మెదడు ఉపరితలం మధ్య గ్యాప్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రెండవ రోగికి న్యూరాలింక్ ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. వీడియో గేమ్‌లు ఆడటానికి, త్రీడీ వస్తువులను ఎలా రూపొందించాలో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్ చిప్‌ను ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. -
స్వల్ప దూర అగ్ని–1 ప్రయోగ పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం. గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్ సిస్టమ్ వంటి అన్ని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచి్చతత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు. -
5జీ కూడా వచ్చేస్తోంది!
మన దేశంలో 4జీ మొబైల్ నెట్వర్క్ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. కొంతమంది ఆపరేటర్లు దీన్ని ప్రవేశపెట్టి, బాగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జపాన్ మాత్రం అప్పుడే ఒకడుగు ముందుకు వేసేసింది. అక్కడ వైర్లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ.. విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేసింది. 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటీ డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సులో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీని ఉటంకిస్తూ సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో.. మిల్లీమీటరు తరంగదైర్ఘ్యంతో కూడిన సిగ్నళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యంతో పంపారు. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్ లాంటి వాణిజ్య ప్రాంగణంలో ఎవరూ 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్‌మిషన్‌లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది. అయితే, తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మొబైల్ పరికరం ఎక్కడుందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది.