న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేసేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అనుమతించింది. దీంతో మిత్సుయి సుమితోమో కంపెనీకి గల 5.17 శాతం వాటాను రానున్న రెండు వారాల్లోగా సొంతం చేసుకునే వీలున్నట్లు మ్యాక్స్ ఫైనాన్షియల్ పేర్కొంది.
షేరుకి రూ. 85 ధరలో 9.91 కోట్ల మ్యాక్స్ లైఫ్ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు మాతృ సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలు తదుపరి మ్యాక్స్ లైఫ్‌లో మాతృ సంస్థ వాటా 87 శాతానికి బలపడనుంది. గతంలో మ్యాక్స్ లైఫ్‌లో మిత్సుయి సుమితోమో 25.48 శాతం, మ్యాక్స్ ఫైనాన్షియల్ 72.52 శాతం చొప్పున వాటాలను కలిగి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment