
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్‌లైన్ చెక్‌ఇన్ సాఫీగా సాగుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆన్‌లైన్ చెక్‌ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment