4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
ప్రైవేట్ టెల్కోలతో పోటీపడలేకపోతున్నాం
కేంద్రానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల యూనియన్ లేఖ
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్‌లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది.
అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్‌లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్‌పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్‌లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్‌టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్‌లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment