ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
కొత్త లోగో
మారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.
ఏడు కొత్త సర్వీసులు
స్పామ్-రహిత నెట్‌వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్‌లు, మెసేజ్‌ల నుంచి బయటపడేస్తుంది. క్లీన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.
బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్‌లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పొందవచ్చు.
ఎనీ టైమ్ సిమ్ కియోస్క్: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.
డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్‌ఎంఎస్ సేవలను ఆస్వాదించవచ్చు.
పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.
గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.
Today at #BSNL HQ, New Delhi, Hon'ble MoC Shri @JM_Scindia Ji, along with Hon'ble MoSC Shri @PemmasaniOnX Ji and Secretary DoT Shri @neerajmittalias Ji, unveiled BSNL’s new logo, reflecting our unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably." pic.twitter.com/EFvYbVASGx
— BSNL India (@BSNLCorporate) October 22, 2024
Comments
Please login to add a commentAdd a comment