సాక్షి, ఢిల్లీ: రెండు నెలల తర్వాత నేడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా విమాన ప్రయాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే మూడో వంతు సామర్థ్యంతో విమానాల సర్వీసులు పనిచేస్తాయి. 7 కేటగిరీల్లో విమాన సర్వీసు ఛార్జీలు అమల్లో ఉన్నాయి. విమాన ప్రయాణికులను క్వారంటైన్‌పై గందరగోళం తలెత్తుతోంది. ప్రయాణికుల క్వారంటైన్ పై తలో బాటలో రాష్ట్రాలు మార్గదర్శకాలను ప్రకటించాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్ నిబంధనలు ప్రకటించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించాయి. గృహ ఏకాంతవాసంలో ఉండాలని మరికొన్ని సూచించాయి.
ప్రయాణికులంతా 14 రోజులపాటు ఇంటికే పరిమితమవ్వాలని కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కోరాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారిని స్వీయ చెల్లింపు క్వారంటైన్‌లో రెండు వారాల తప్పనిసరి బీహార్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాణికులంతా తాము వెళ్లే రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య ప్రొటోకాల్‌లను ముందే చదవాలని విమానయాన సంస్థలు కోరాయి. ఆయా రాష్ట్రాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చినా, వాటిలో క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చినా తమకు సంబంధం లేదని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.విమాన సేవల పునఃప్రారంభాన్ని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలతో ముమ్మర చర్చలు జరుపుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బాగ్‌డోగ్రా విమానాశ్రయాల్లో గురువారం నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment