దొండపర్తి(విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు నుంచే సేవలు అందించేందుకు ఆ సంస్థ సమాయత్తమవుతోంది. ముందుగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఓ ప్రైవేట్ నిర్మాణంలో కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు నగరంలో అన్వేషిస్తున్నారు.
చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
800 ఉద్యోగుల కోసం..
ఇప్పటివరకు ఇన్ఫోసిస్ సంస్థ మెట్రో నగరాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. టైర్–2 నగరాల్లో అన్నింటి కంటే విశాఖే ప్రథమ స్థానంలో ఉండడంతో.. ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్ ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 750–800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేíÙస్తున్నారు. ఇక్కడ కార్యాలయం ఏర్పాటు వల్ల రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదు. పశి్చమ, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది.
త్వరలో పూర్తి స్థాయిలో సేవలు
ఇన్ఫోసిస్ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయాలతో విశాఖలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటి వరకు సొంత నిర్మాణాల్లోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలయానికి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం అధిక శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. కోవిడ్ క్రమంగా తగ్గుతుండడంతో మళ్లీ కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను మెట్రో నగరాలకు రప్పించే కంటే రాష్ట్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇన్ఫోసిస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. అందుకు అనువైన వాతావరణాన్ని కలి్పస్తామని భరోసా కలి్పంచింది. దీంతో విశాఖ కేంద్రంగా సంస్థ సేవలు అందించేందుకు సంస్థ ఆసక్తి చూపించింది.
భవిష్యత్‌లో విస్తరణ
ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. భవిష్యత్తులో సంస్థ సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇన్ఫోసిస్ రాకతో విశాఖలో ఐటీ పునరుత్తేజానికి బాటలు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. మున్ముందు మరిన్ని బహుళ జాతి సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విద్యావేత్తలు, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment