- రూ.3280.83 కోట్లతో ప్రణాళికలు
- స్వాతంత్య్ర దినోత్సవంలో పీవో వినయ్‌చంద్
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనుల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ఐటీడీఏ పని చేస్తుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ అన్నారు. తలారిసింగ్ క్రీడామైదానంలో స్వాతంత్య్ర దినోత్సవా న్ని శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవో జాతీయ జెండాను ఎగు ర వేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిం చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో రూ.3280.83 కోట్లతో గిరిజన సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభు త్వ ఆమోదం రాగానే తాగునీరు, విద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, ఉద్యాన వనం, పట్టుపరిశ్రమ, విద్యుత్ తదితర రంగాల్లో కార్యక్రమాలు విస్తృతమౌతాయన్నారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో బ్యాంకు సేవలను విస్తృతం చేసి గిరిజన రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ రాయితీలను పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇందిరమ్మ, పచ్చతోరణం పథకాల కిం ద ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పండ్ల జాతుల మొక్కలను పెంచుతున్నామన్నారు. గతేడాది 9,371 మంది విద్యార్థులకు రూ.10.47 కోట్ల ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.104.59 కోట్ల అం చనా వ్యయంతో పాఠశాల భవనాలు, డీఆర్ డిపోలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉపాధి పథకం ద్వారా రూ.29.67 కోట్లతో సీసీ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించామన్నారు.
ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు ద్వారా గిరిజన రైతులకు తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనులకు కూలి పనులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఎఫ్‌ఓ శాంతారాం, ఏఎస్పీ ఎ.బాబూజీ, ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ ఈఈ ఎం.ఆర్జీ నాయుడు, పాడేరు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, ఉపాధ్యక్షురాలు ఎం.బొజ్జమ్మ, పాడేరు సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం పలు డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు, పలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ఐటీడీఏ పీవో, డీఎఫ్‌ఓ, ఏఎస్పీలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన సీఏహెచ్ పాఠశాల హెచ్‌ఎం జి.వి.ప్రసాద్, వార్డెన్ మల్లికార్జునరావు, పీడీ సింహాచలం, ఇతర ఉపాధ్యాయులందర్ని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ప్రత్యేకంగా అభినందించి మెమెంటోలను అందజేశారు.