తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్ | Tirupati Commissioner Vinay Chand | Sakshi
Sakshi News home page

తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్

Published Thu, Jan 8 2015 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్

తిరుపతి కమిషనర్‌గా వినయ్‌చంద్

తిరుపతి కార్పొరేషన్:  తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ టి.సకలారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వాడరేవు వినయ్‌చంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేస్తున్న వినయ్‌చంద్ జిల్లాకు సుపరిచితుడు. 2011 నుంచి 2013 వరకు మదనపల్లె సబ్ కలెక్టర్, ఆపై చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.

తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బీటెక్ చేసి ఐఏఎస్‌గా ఎంపికైన వినయ్‌చంద్‌ను తిరుపతి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత కమిషనర్ సకలారెడ్డి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయూలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement