'గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి'
విశాఖపట్టణం: గంటా శ్రీనివాసరావుపై డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు. కులం పేరు చెప్పుకుని కులానికే ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో ధర్మశ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మార్చి 8న విశాఖలో జరిగే మహిళా ప్రజాగర్జన సందర్భంగా గంటా బృందం టీడీపీలో చేరతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేశ్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య టీడీపీలోకి వెళ్లనున్నారు.