అసెంబ్లీలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
సాక్షి, అమరావతి: రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఇది అద్భుతమైన పథకమని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రైతు భరోసా పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. కౌలు రైతు చట్టం తీసుకువచ్చి వారి ప్రయోజనాలు కాపాడుతున్నామని చెప్పారు. ఆక్వా రైతులను కూడా ఆదుకున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. తన ప్రసంగంలో ప్రాసలతో ఎమ్మెల్యే ధర్మశ్రీ సభ్యులను ఆకట్టుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ప్రకటించే పవిత్ర రూపం రైతు అని.. రాజు చేతిలోని ధర్మదండం కన్నా రైతు చేతిలోని నాగలి మిన్నా’ అని ఓ కవి చెప్పారని గుర్తు చేశారు.
ధర్మశ్రీ ప్రసంగం సాగిందిలా..
►ప్రపంచ నాగరికతకు మూలపురుషుడు వ్యవసాయదారుడు. కర్షకుడు సమాజంలో హర్షకుడు అవ్వాలని భవిష్యత్తులో రైతు విమర్శింపపడకూదని.. దేశానికి, భావి తరానికి నేతగా, అన్నదాతగా మారాలని, తలరాత మార్చాలన్న ఉద్దేశంతోనే రైతు భరోసా పథకానికి సీఎం జగన్ రూపకల్పన చేశారు.
►రైతే రాజుగా భావించిన మనసున్న మారాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొంటూ.. ‘అన్నదాతలే ఆయన ధ్యాస, శ్వాస, ఆశ, ఆకాంక్ష’ అన్నారు.
►రైతు భరోసాతో సీఎం జగన్.. ‘అన్నదాతకు అండగా, రైతునేస్తంకు కొండగా, ఆదుకోవాలని మెండుగా, జగనన్న నిలిచాడు తోడుగా, మన రాష్ట్ర రైతుకు నీడగా’ నిలిచారని ధర్మశ్రీ ప్రశంసించారు.
►చంద్రబాబు రుణమాఫీ అని చెప్పి టోపి పెట్టారని ఎద్దేవా చేస్తూ.. ‘మాఫీ అని చెప్పి, ఏపీ రైతులందరికీ టోపీ పెట్టి హ్యాపీగా పదవులు పొంది రైతులకు బీపీ పెంచారు తప్పా.. టీడీపీ హయాంలో ఏరోజైనా రైతులు హ్యాపీగా ఉన్నారా’ అంటూ ప్రశ్నించారు.
►కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఎంతోగానో ఉపయోగపడిందని చెబుతూ.. ‘కౌలు రైతులు సమాజంలో తిరిగాలని, మరింత ఎదగాలని, ఆర్థికంగా పెరగాలని, గౌరవంగా ఒదగాలని’ అన్నారు.
సంబంధిత వార్తలు..
శవ రాజకీయాలు బాబుకు అలవాటే: సీఎం జగన్
చంద్రబాబుపై వంశీ ఆగ్రహం
చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదు
ఆదాయం తగ్గుదలపై టీడీపీ తప్పుడు ప్రకటన
వంశీ ప్రసంగిస్తే అంత ఉలుకెందుకు?
Comments
Please login to add a commentAdd a comment