వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ | Malla Vijay Prasad, Karanam Dharmasri joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ

Published Wed, Mar 12 2014 6:01 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

కరణం ధర్మశ్రీ - Sakshi

కరణం ధర్మశ్రీ

హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు.

తాజాగా విశాఖపట్టణం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ ప్రసాద్‌, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ... వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం  సిద్దం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement