Malla Vijay Prasad
-
రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మల్లా విజయ ప్రసాద్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మల్లా విజయ ప్రసాద్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాం ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా తోడ్పడతాను విజయ ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు తో పాఠశాలలని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు మంచినీరు వంటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. తనపై ఎంతో నమ్మకంతో సీఎం జగన్ అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని విజయ ప్రసాద్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నాగరాజు , జనరల్ మేనేజర్ మల్లికార్జున రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు గోపీచంద్, కరుణాకర్,ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రామారావు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ -
‘అందుకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇష్టం లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి మళ్ల విజయ ప్రసాద్ మండిపడ్డారు. విశాఖ రాజధాని అవసరం లేదని చంద్రబాబు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గ్రేటర్ విశాఖ పరిధిలోని 90వ వార్డు గవర వీధి స్కూల్, 91వ వార్డు గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. (చదవండి: బాగున్నావా కేకే.. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపు) అనంతరం విజయ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరు నచ్చకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోంది. ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేసేవాళ్లు.. అభివృద్ధిని కళ్లు తెరిచి చూడాలన్నారు. ప్రతి నెలా తెల్లవారక ముందే ఇంటింటా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు-నేడు పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందని మళ్ల విజయ ప్రసాద్ తెలిపారు. (చదవండి: ఇది మీ మేనమామ ప్రభుత్వం) -
'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్‌తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్) మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా) మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్‌కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. -
‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఎన్నడూ లేని విధంగా ఓకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు లక్షా ఇరవై వేల ఉద్యోగాలను కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్లా విజయప్రసాద్ అన్నారు. విశాఖలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న చంద్రబాబును.. 5 కోట్ల మంది అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన, మాట్లాడిన చంద్రబాబుపై డీజీపీ తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్దాలకు రాష్ట్రం అతలాకుతలమైందని, మద్యం దుకాణాలపై ఆయన చేసిన అసత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ కన్వీనర్ మళ్ల విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల ప్రయోజనాలతో విశాఖ కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు, శ్రీదేవి వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘విశాఖలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి’
సాక్షి, విశాఖపట్నం : పోస్టల్ బ్యాలట్ విషయంలో విశాఖ జిల్లాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్సార్ సీపీ నేత, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీకి పోస్టల్ బ్యాలట్ అందడంతోనే భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకొకపోవడం దారుణమన్నారు. కౌంటింగ్ సమయంలో మరో ఐఎఎస్ అధికారిని విశాఖలో నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతునున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది : మళ్ల విజయప్రసాద్ అధికార టీడీపీ పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎత్తుగడలను ఎదుర్కోవడానికి వైఎస్సార్ సీపీ శ్రేణులను శిక్షణకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి : విజయనిర్మల ఫొని తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేత అక్కరమాని విజయనిర్మల డిమాండ్ చేశారు. జాలారిపేట, శివ గణేష్ నగర్లో కొట్టుకుపోయిన బోట్లు, వలలకు పరిహారంగా కొత్తవాటిని మత్స్యకారులకు అందించాలన్నారు. -
లింగమనేని నిర్మాతగా.. పవన్ యాక్షన్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అందిస్తుంటే.. లింగమనేని నిర్మాతగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. టీడీపీ వ్యతిరేక ఓట్లు వైఎస్సార్ సీపీకి రాకుండా ఉండేందుకే పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ఐదు కిలోమీటర్లు నడిస్తే అపసోపాలు పడతారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం మూడు వేల కిలోమీటర్లకుపైగా నడిచారని తెలిపారు. పవన్ ఇల్లు నిర్మించిన స్థలం లింగమనేనిది కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాల పేరిట కోట్ల రూపాయలు వృథా చేస్తున్న పవన్ నోరు మెదపరని మండిపడ్డారు. బాక్సైట్ కోసం మాట్లాడే అర్హత పవన్ లేదన్నారు. నాడు గిరిజనులు నష్టపోతారని వైఎస్సార్ బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ చింతపల్లిలో సభ పెట్టి గిరిజనులకు బాసటగా నిలిచారని అన్నారు. జననేతపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, రమణ మూర్తి, శ్రీనివాస్ వంశీకృష్ణ, నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్ వెస్లీ, మహిళ విభాగం ప్రతినిధి షీలా వెంకట లక్ష్మీ, నాయకులు కొండా రాజీవ్, శ్యామ్ కుమార్‌రెడ్డి, బోని శివరామకృష్ణ, పక్కి దివాకర్‌లు పాల్గొన్నారు. -
విశాఖ ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఏడీ కొత్తరోడ్డులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణాన్ని చలార్చడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్‌తో పార్టీకి చెందిన ఇతర నాయకులు.. శ్రీధర్‌కు సంఘీభావంగా ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకుడిని విడిచిపెట్టాలని స్థానికులు, కార్యకర్తలు ఉదయం నుంచి పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ.. పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నందువల్లే శ్రీధర్‌ను అరెస్ట్ చేసి ఉంటారని అన్నారు. గతరాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులు చేతబడి ప్రమోగించి పలువురి మరణానికి కారణం అవుతున్నారంటూ ఆరోపిస్తూ స్థానికులు వారిపై దాడికి దిగారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయారని.. దీనికి ఆ దంపతులే కారణమని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు. స్థానికులు ఆ దంపతులను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలలకొంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జియ్యాని శ్రీధర్‌తోపాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అనుకోకుండా అల్లరి చెలరేగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మహిళలను అని కూడా చూడకుండా చితకబాదారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ఇప్పటికైనా సీబీఐ విచారణ చేయించాలి
విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వైఎస్సార్సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ హస్తం ఉందని ఆరోపణలున్నాయని, కానీ సిట్ లోకేష్ పేరు తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని వ్యాక్యానించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీ ఎంక్వైరీ వేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎం అవహేళన చేస్తూ మాట్లాడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలన అక్రమాల పుట్టగా సాగిందని, నిజాయతీ ఉంటే సీఎం తన పాలనపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. -
హత్యాయత్నం ఘటనను సీఎం అవహేళన చేశారు
-
నిగ్గు తేల్చమంటే సిగ్గుమాలిన ప్రకటనలా?
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని అడిగితే సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ ధ్వజమెత్తారు. దుండగుడి హత్యాయత్నంతో గాయపడిన వై.ఎస్.జగన్‌ను కనీసం పరామర్శించాల్సిన ఇంగితజ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం విచారకరమన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతపై చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రంలో నరరూప పాలన సాగుతున్నట్టు ఉందంటూ రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఈ నెల 25న మధ్యాహ్నం 12.38 గంటలకు ఫ్యూజన్ ఫుడ్ వర్కర్ చేతిలో హత్యాయత్నానికి గురైన జగన్ ప్రథమ చికిత్స అనంతరం ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరారని, ఆయన ఇంకా హైదరాబాదు చేరుకొనేలోపే మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర డీజీపీ ప్రెస్‌మీట్ మెట్టి జగన్ అభిమానే కత్తితో దాడికి పాల్పడ్డారంటూ ప్రకటించడంలో అంతర్థామేమిటని మళ్ల ప్రశ్నించారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోనే ఉండగా.. డీజీపీ ఏ ఆధారాలతో మీడియాతో అలా చెప్పారని ఆయన నిలదీశారు. జననేతపై దాడి జరిగిన ప్రాంతం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడంలో పరమార్థం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందన్నారు. ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ, ఏకంగా ఢిల్లీకి వెళ్లి తన చేతకాని తనాన్ని బాహటంగా చంద్రబాబు చెప్పుకుని ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నం కేసును జ్యూడీషియల్ విచారణకు ఆదేశించి, ఇందులో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. నిందితుడికి ఎన్వోసీ ఇప్పించింది ఎవరు? విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో పని చేయడానికి నేర చరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు నోఅబ్జెక్షన్ సర్టిఫికేటు(ఎన్వోసీ) ఇప్పించింది ఎవరని మళ్ల ప్రశ్నించారు. అత్యంత భద్రత ఉం డే వీఐపీ లాంజ్‌లో ఫ్యూజన్ ఫుడ్స్‌లో కుక్‌గా పని చేసే శ్రీనివాసరావు వెయిటర్‌గా ఆ రోజు అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి అన్న దానిపై విచారణ చేస్తున్నారో లేదో చెప్పకుండా సిట్ అధికారులు తాత్సారం చేయడం వెనుక అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. నిందితుడు శ్రీనివాసరావును ఫ్యూజన్ ఫుడ్ యజమాని హర్షవర్థన్ ఏ ప్రాతిపాదిక చేర్చుకున్నారు! అనే కో ణంలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనను వైఎస్సార్సీపీపై నెట్టేందుకు చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర పోలీసులు కుతంత్రాలు పన్నుతున్నారని ఆక్షేపించారు. ఏ సంబంధం లేని పార్టీ నగర కార్యాలయంలో బాయ్ కె.కృష్ణకాంత్(కె.కె)ను సిట్ అధికారులు విచారించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఈ కేసును చిన్నదిగా చూపి మాఫీ చేయడానికి అధికార పార్టీ పన్నాగంలో భాగంగానే విచారణలో జాప్యానికి కారణమన్నారు. కేసును నీరుగార్చేలా వీధికో మంత్రి చొప్పున నోటికొచ్చినట్టుగా ప్రకటనలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్వీర్యం : తైనాల రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్టు కనిపిస్తుందని వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను నివ్వెరపరుస్తుందన్నారు. మానవత్వంతో స్పందించాల్సిపోయి రాద్దాం తం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేటి యువతకు రాజకీయాలంటే అసహ్యం వేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మె ల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు పట్టపగలు హత్యకు గురి కావడం బట్టి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో స్పష్టమవుతోందన్నారు. సిట్ విచారణలో ఇంత వరకు చేసిన కేసులకు పురోగతిలేదని, జగన్‌పై హత్యాయత్నం కేసులో నిజాలు బయటకు రావాలంటే జ్యూడీషియల్ విచారణతో సాధ్యమన్నారు. ఈ సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, డాక్టర్ పి.వి.రమణమూర్తి, కోస్తాం ధ్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఐ.హెచ్.ఫరూకీ, రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, రాష్ట్ర అదనపు కార్యదర్శి జి.వి.రవిరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, విశాఖ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ ప్రేమ్‌బాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లి చంద్రశేఖర్, బీసీ సెల్ అధ్యక్షుడు కె.ఆర్.పాత్రుడు, ఎస్సీసెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెయి వెంకటరమణ, విశాఖ పార్లమెంట్ సేవాదల్ అధ్యక్షురాలు యువశ్రీ పాల్గొన్నారు. -
నిందితుడి జేబులో మాకు లెటర్ కనిపించలేదు
విశాఖపట్నం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నంపై వైఎస్సార్సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ పలు అనుమానాలు లేవనెత్తారు. విశాఖపట్నంలో విజయ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్ వీఐపీ లాంజ్‌లోకి ఎలా వచ్చాడని ప్రశ్నించారు. ఎవరి సహాయంతో టీతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెస్టారెంట్లో ఎలా చేరాడు.. శ్రీనివాస్‌కు ఎన్ఓసీ ఎక్కడ, ఎవరు ఇచ్చారు. ఈ విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని సూటిగా పోలీసులను అడిగారు. శ్రీనివాస్ వాటర్ బాటిల్‌ను అడ్డం పెట్టుకుని, పదునైన కత్తి వాడిన విషయాన్ని పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారని సందేహం లేవనెత్తారు. వైఎస్ జగన్ హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ సీఐఎస్ఎఫ్ అధీనంలో సాయంత్రం ఐదున్నర వరకు ఉంటే డీజీపీ, నిందితుడిని విచారించకుండా ఎలా మాట్లాడారని అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగినపుడు నిందితుడి జేబులో మాకు లెటర్ ఎక్కడా కనిపించలేదని, హత్యాయత్నం జరిగిన సమయంలో తానూ అక్కడే ఉన్నానని విజయ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని, అప్పటికప్పుడే సీఎం కార్యాలయం నుంచి ఫోటోలు రావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కేంద్రం అధీనంలో ఉందని చెబుతున్న ప్రభుత్వం, స్టేట్మెంట్లు ఇచ్చి ఉలిక్కి పడుతోందన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత గలనాయకుడు.. అందుకే సహనంతో ఉన్నామని పేర్కొన్నారు. రెండు రోజులు విచారణ చేసినా లాభం లేదట..పనికి మాలిన వాళ్లని పిలిచి విచారిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసుకు సంబంధంలేని వైఎస్సార్సీపీ కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్‌ను పిలిచి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారించారని మండిపడ్డారు. ఘటన అంతా వైఎస్సార్సీపీ మీద వేయడానికి చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. పంచనామాలో సీఐఎస్ఎఫ్ కత్తి గురించి ప్రస్తావించారా..సీఐఎస్ఎఫ్ పంచనామా బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు శివాజీకి సమాచారం ఎవరిస్తున్నారు..అదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘జనం నిలదీస్తారన్న భయంతో మాపై బురద జల్లుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే వైఎస్సార్ సీపీ మీద బురద జల్లుతున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ల మీద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అలాగే వక్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 1300 కోట్లే కేటాయించారని తెలిపారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలన్నారు. -
విజయ మణిహారం
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఇంతవరకూ సొంతంగా పార్టీ కార్యాలయం లేకపోవడం.. ఇప్పుడు పూర్తి హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో మద్దిలపాలెం డాక్టర్.వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కాలేజీ దగ్గర సొంత పార్టీ కార్యాలయం నిర్మితమవడం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. తమ గొంతు వినిపించేందుకు, తమ భావాలు పంచుకునేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు ఓ వేదిక దొరికినందుకు పార్టీ అంతర్గతంగానూ సమరోత్సాహం మొదలైంది. ఇందుకు పూర్తి సహాయం అందించిన పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ను ప్రశంసలతో ముంచెతుతున్నారు. కార్పొరేట్ లుక్‌తో కనిపిస్తున్న పార్టీ కార్యాలయాన్ని తిలకించేందుకు కార్యకర్తలు తరలివస్తున్నారు. వెయ్యిమందితో సమావేశానికి వీలుగా విశాలమైన సభాప్రాంగణం, ముఖ్యనేతల సమావేశానికి వీలుగా ఏసీ కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, ఎంపీ విజయసాయిరెడ్డి సహా, ఇతర నాయకులకు ప్రత్యేకంగా చాంబర్లు నిర్మించారు. పార్టీ కార్యాలయం విశాఖ ‘విజయ’ మణిహారంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. మళ్ల విజయప్రసాద్ తన సొంత నిధులతో అద్భుతంగా నిర్మించిన ఈ కొత్త కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే, శాసన సభాపక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు. నా చిరకాల కోరిక :మళ్ల విజయప్రసాద్ ‘సొంత నిధులతో సర్వాంగ సుందరంగా పార్టీ కార్యాలయం నిర్మించాలనే నా చిరకాల కోరిక నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీవెనలతో కార్యాలయం నిర్మించాం. సొంతింట్లో కలిసి మెలసి ఉండేలా కార్యకర్తలకు సదుపాయాలు కల్పించాం’. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు టీడీపీ నేతల అరాచకాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. దుష్టపాలనకు అంతిమ ఘడియలు: బూడి ముత్యాలనాయుడు ‘పార్టీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన టీడీపీని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నవరత్నాల పథకాలు నవ్యాంధ్రకు స్వర్ణమయం చేస్తాయి. పేదల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే జగన్ యాత్ర చేపట్టారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. మోసగాడు గంటా:గుడివాడ అమర్నాథ్ ‘ఒంగోలు నుంచి వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు రెండు దఫాలు మంత్రిగా చేసి, 20 ఏళ్లగా రాజకీయాల్లో ఉంటున్నా విశాఖ జిల్లాకు ఆయన చేసిందేమీ లేదు. మంత్రి ముగుసులో భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారు. బ్యాంకులో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బురిడీ కొట్టించిన 420 మంత్రి ఆయన. జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఇలాంటి మోసగాడికి లేదు. మంత్రి గంటా 420 అయితే సీఎం చంద్రబాబు 840. ప్రజాధనంతో చంద్రబాబు దుబాయ్‌కి, తనయుడు అమెరికాకు తిరుగుతున్నారు’. నిజాయితీకి మారుపేరు వైఎస్సార్ సీపీ: తైనాల ‘నిజాయితీ, నిబద్ధత, సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. టీడీపీలాగా దండుకొని, దందా చేసి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించలేదు. నిజాయితీగా సేవ చేయడానికి ప్రజాసంకల్పయాత్రతో మా పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి 3వేల కి.మీ పాదయాత్రకు పూనుకున్నారు. ఆ యాత్రకు వస్తున్న స్పందనతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా, ఇంత వరకు గవర్నర్‌ను మార్చమని అడగలేని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పడు కొత్త గవర్నర్ కావాలని అడగడం విడ్డూరంగా ఉంది’. -
వైఎస్సార్ సీపీలో చేరిన మళ్ల, ధర్మశ్రీ
హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా విశాఖపట్టణం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ... వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.