సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే వైఎస్సార్ సీపీ మీద బురద జల్లుతున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ల మీద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అలాగే వక్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 1300 కోట్లే కేటాయించారని తెలిపారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment