‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’ | Visakha West Kanvinor Malla Vijay Prasad Slams On Chandrababu Over His False Statement | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి’

Published Thu, Oct 3 2019 6:38 PM | Last Updated on Thu, Oct 3 2019 7:02 PM

Visakha West Kanvinor Malla Vijay Prasad Slams On Chandrababu Over His False Statement - Sakshi

సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఎన్నడూ లేని విధంగా ఓకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు లక్షా ఇరవై వేల ఉద్యోగాలను కల్పించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ వెస్ట్‌ కన్వీనర్‌ మళ్లా విజయప్రసాద్‌ అన్నారు. విశాఖలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న చంద్రబాబును.. 5 కోట్ల మంది అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన, మాట్లాడిన చంద్రబాబుపై డీజీపీ తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్దాలకు రాష్ట్రం అతలాకుతలమైందని, మద్యం దుకాణాలపై ఆయన చేసిన అసత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement