koyya prasada reddy
-
‘చంద్రబాబు చుట్టూ డర్టీ డజన్ నాయకులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజలు కరోనాలో బాధపడుతుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సబ్బం హరి లాంటి డర్టీ డజన్ నాయకులు ఉన్నారని, వారితో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. యనమల కలియుగ శకుని అని తూర్పు జనం అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ రాజకీయ బిక్షతో స్పీకర్ పదవి పొందిన యనమల చంద్రబాబు మాటలతో వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబును చూస్తే భారతంలో దుర్యోధనుడు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి కాంగ్రెస్‌కి పట్టిన గతే పడుతుందన్నారు. విశాఖపై విషం కక్కుతున్న టీడీపీని నిలదీయాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జర్నలిస్టులపై ఉందని ప్రసాద్రెడడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని యూ టర్న్‌లు తీసుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. ఆకు రౌడీ సబ్బం, కలియుగ శకుని యనమల పతనం చివర దశలో ఉందన్నారు. మున్సిపల్ స్థలంలో సబ్బం హరి నివాసం ఉంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో విశాఖ నగరం మరో ముంబై, చెన్నై నగరాల సరసన చేరనుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విశాఖ నుంచి మొదలుపెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘అబద్ధాల వల్లే హుద్‌హుద్ తుఫాన్ వచ్చింది’
సాక్షి, విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్రలాంటి వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా దుర్మార్గ పాలన నడిపారని విమర్శించారు. విశాఖలోని ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీ, నౌకాశ్రయం, అచ్యుతాపురం ఎస్ఈజెడ్లు వైఎస్సార్ హయాంలోనే వృద్థి చెందాయని, ఆయన మరణానంతరం విశాఖ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఏదో జరిగిపోయినట్టు హడావిడి చేస్తున్నారని, ఉత్తరాంధ్రపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అతి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని ముఖ్యమంత్రి విశాఖను ఎంచుకున్నారని, కక్షతో మాకొచ్చే అవకాశాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలన అంతా అబద్దాలతోనే సాగిందని, ఆ అబద్దాల వల్లే హుద్‌హుద్ లాంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు మీ అభిప్రాయన్ని మీ నాయకులకు తెలియజేయాలని ప్రసాదరెడ్డి సూచించారు. మరోవైపు రైతుల పట్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ దేశంలో మరే నాయకుడికి లేదని ప్రశంసించారు. -
‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఎన్నడూ లేని విధంగా ఓకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు లక్షా ఇరవై వేల ఉద్యోగాలను కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్లా విజయప్రసాద్ అన్నారు. విశాఖలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న చంద్రబాబును.. 5 కోట్ల మంది అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన, మాట్లాడిన చంద్రబాబుపై డీజీపీ తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్దాలకు రాష్ట్రం అతలాకుతలమైందని, మద్యం దుకాణాలపై ఆయన చేసిన అసత్య వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
'చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది'
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమో అనే అనుమానం కలుగుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదని కొయ్య ప్రసాదరెడ్డి శనివారమిక్కడ మీడియా సమావేశంలో అన్నారు. లోకేష్ ఏ హోదాలో విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు వస్తానంటున్నారో అర్థం కావటం లేదని కొయ్య ప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను లోకేష్ ద్వారా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటీవల పారిశ్రామిక సదస్సులు పెట్టి పనికిరాని ఎంవోయూలు చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసింది రైతు రుణమాఫీ కాదని, రైతు మాఫీ అని కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు.