
సాక్షి, విశాఖపట్నం: అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు.. అధికారం పోయిన తర్వాత పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. మంగళవారం విశాఖలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడని, రాజకీయాల్లో జూనియర్ అని, మోదీని ఓడిస్తానని చంద్రబాబు విసిరిన సవాల్‌ను గుర్తు చేశారు.
► తన ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను దగా చేసి, ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పడం విడ్డూరం.
► బాబు డ్రామాలే.. టీడీపీని కోమాలోకి తీసుకెళ్లాయి.
► విశాఖపై విషం చిమ్మితే చంద్రబాబుకి, ఆయన పార్టీకి పుట్టగతుల్లేకుండా చేస్తాం. మీ అనుకూల మీడియాలో చేస్తున్న విమర్శలను ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారు.
► సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర సంక్షేమానికి రూ.59,425 కోట్ల కేటాయింపులు చేయడమే కాకుండా వాటిని ఖర్చు చేశారు.
► గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం సంక్షేమానికి రూ.90వేల కోట్లు కేటాయించి.. రూ.44,535 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment