
సాక్షి, విశాఖ: చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరయ్యారు. నగరంలోని ది పార్క్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు సుమ-చిన్నం నాయుడును సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీ వాణి, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మాధవి, బెల్లన చంద్రశేఖర్, బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదీప్ రాజ్, ఉమాశంకర్ గణేష్,గొల్ల బాబూరావు, సంబంగి చిన్న అప్పల నాయుడు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి గన్నవరం తిరుగు ప్రయాణం అయ్యారు. (కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ)
Comments
Please login to add a commentAdd a comment