
సాక్షి, విశాఖ: కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కిల్లి కృపారాణి కుమారుడి వివాహం బుధవారం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు క్రాంతికుమార్, అలేఖ్యలను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర‍్మాన కృష్ణదాసు, వైఎస్సార్ శ్రీకాకుళం జిల్లా నాయకులు పిరియా సాయిరాజ్, పేరాడ తిలక్ వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment