'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం' | Kapu leaders takes on chandrababu naidu decisions | Sakshi
Sakshi News home page

'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం'

Published Mon, Jun 13 2016 3:15 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం' - Sakshi

'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం'

విశాఖ: కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను ఏకాకిని చేస్తే ఊరుకోమని.. కాపు నేతలు తోట రాజీవ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ కాపు నేతలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సోమవారం విశాఖలో వీజేఎఫ్లో జిల్లా, నగర కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు రాకపోవడం శోచనీయమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పరాకాష్టకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. కాపులు పోరాటం చేస్తుంటే మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. కాపులు ఉద్యమిస్తారనే భయంతో ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement