thota rajeev
-
YSRCPలో చేరిన కాపు జేఏసీ నేతలు
-
కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా?
విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుపై కాపు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కాపు సంఘాలు నాయకులు మంగళవారం మంత్రి గంటాతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. వారితో చర్చలు జరిపేందుకు నిరాకరించిన మంత్రి తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము ఏం చెబుతామో కనీసం వినిపించుకోకుండా వెళ్లిపోవడంపై కాపు నేతలు మండిపడ్డారు. 'నీకు ఆ హోదా ఎక్కడి నుంచి వచ్చింది' అంటూ విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ ప్రశ్నించారు. పదవుల కోసం మీటింగులు పెట్టి కాపు జాతిని వాడుకున్న రోజులు మరిచావా అని నిలదీశారు. కాగా, భీమిలి పర్యటనలోనూ కాపులపై మంత్రి గంటా అసనహనం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా కాపు సంఘాలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. -
'ముద్రగడను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోం'
విశాఖ: కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను ఏకాకిని చేస్తే ఊరుకోమని.. కాపు నేతలు తోట రాజీవ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ కాపు నేతలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సోమవారం విశాఖలో వీజేఎఫ్లో జిల్లా, నగర కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పరాకాష్టకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. కాపులు పోరాటం చేస్తుంటే మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. కాపులు ఉద్యమిస్తారనే భయంతో ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.