ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం | Karanam Dharmasri Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం

Published Sat, Jul 25 2020 5:25 AM | Last Updated on Sat, Jul 25 2020 5:28 AM

Karanam Dharmasri Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పవన్‌కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరారని వైఎస్సార్‌సీపీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో తెలియని పరిస్థితిలో పవన్‌ ఉన్నారన్నారు. గాజువాక వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తే మీకేంటి బాధ? గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి పవన్‌ ఓడిపోవడంతో ఉత్తరాంధ్రపై ద్వేషం పెంచుకున్నారు.
► విశాఖ ప్రజలు ఛీదరించారని ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.
► ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ పెట్టి ఆరు నెలలకోసారి ఒక ప్రశ్న వేసి తర్వాత కనిపించని పవన్‌ మూడు రాజధానులు ఎలా ఇస్తారని ప్రశ్నించడం హాస్యాస్పదం.
► టీడీపీతో ఐదేళ్ల పాటు కాపురం చేసిన పవన్‌కు అమరావతి.. అప్పుడు భ్రమరావతిగా కనిపించలేదా?
► నిజమైన రాజకీయ నాయకుడు అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేయాలి 
► భూస్థాపితం అయిన పార్టీల నాయకులు ఉనికిని చాటుకోవడం కోసమే పనికిరాని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement