
న్యూడిల్లీ: త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.
ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకే పరిమితమై ప్రజలకు చేరువవుతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం కాషాయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు.
చదవండి: త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
Comments
Please login to add a commentAdd a comment