Viral Video: Bengaluru Auto Driver In Tears After Earning Rs 40 In 5 Hours - Sakshi
Sakshi News home page

కర్ణాటక ఆటోడ్రైవర్ల దుస్థితి.. కన్నీటి పర్యంతమైన ఆటో డ్రైవర్  

Published Wed, Jun 28 2023 5:54 PM | Last Updated on Wed, Jun 28 2023 6:55 PM

Rs 40 in 5 Hours Bengaluru Auto Driver In Tears Viral Video - Sakshi

బెంగుళూరు: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. ఈ పథకం అమల్లోకి రావడంతో మా జీవితాలు పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిలో పడ్డాయని వాపోతూ కన్నీటి పర్యంతమయ్యాడు ఒక ఆటో డ్రైవర్. ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటో నడిపినా  రూ. 40 కూడా రాలేదన్నాడు. 

దయనీయం.. 
ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా వైరల్ గా మారింది. ఓ మీడియా ప్రతినిధి బెంగుళూరులోని ఒక ఆటో వద్దకు వెళ్లి డ్రైవరుతో మాటామంతీ కలపగా.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చాక ఎవ్వరూ ఆటోలను  పట్టించుకోవడమే  లేదని ఆవేదన చెందాడు.

ఉదయం నుండి ఐదు గంటలపాటు ఏకధాటిగా ఆటో నడిపినా పట్టుమని రూ.40 కూడా మిగలలేదని జేబులో నుంచి రెండు 20 రూపాయల నోట్లు చూపించి.. ఆటో బండి సంగతిలా ఉంటే మేము బ్రతుకు బండిని నడిపేదెలా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఓ పెద్దాయన ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  

ఎవరి దారి వారిది.. 
ఈ వీడియోకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఉచితాలు ప్రకటించిందని.. వాటికి ఆకర్షితులై ప్రజలు ఓట్లేశారని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇవి ప్రభావ చూవుతాయని ఒకరు అభిప్రాయాపడగా, ఆడవాళ్ళంతా బస్సుల్లో ఉంటే మగవాళ్ళంతా ఇళ్లల్లో దూరి తలుపులు వేసుకున్నారా? అని మరొకరు.. గతవారం జయదేవ నుండి మల్లేశ్వరం వెళదామంటే ఆటోస్టాండ్లో అందరూ ఖాళీగానే ఉన్నారు కానీ ఒక్క డ్రైవర్ కూడా రాలేదు.. రెట్టింపు చార్జీ ఇస్తామన్నా కూడా కనికరించలేదు. వీళ్లకు ఇదే తగిన శాస్తి అని వేరొకరు స్పందించారు. 

ఇది కూడా చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement