ఉమెన్ చాందీ (పాత ఫోటో)
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. కన్నడలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఊమెన్ చాందీ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా చాందీ శనివారం ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.
గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎన్నికలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. కన్నడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందని, ఆ విశ్వాసమే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, కేరళ ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు.
కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓపెనింగ్స్ లాంటివని, త్వరలో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2019లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. గత 70 ఏళ్ళుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి ఎంతో చేస్తే... మోదీ తన స్వార్ధ రాజకీయం కోసం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment