సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా త్వరలో విధానసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రహస్య సర్వే నిర్వహించారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో పలువురు బీజేపీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారికి టికెట్లు ఉండవని చెబుతున్నారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇస్తారని ఆ సర్వే సమాచారం.
దీంతో అక్కడ ఎమ్మెల్యేల కంటే బలమైన నాయకుల్ని గుర్తించే పనిలో ఉంది. అమిత్‌షా ఆదేశాలతో రహస్య సర్వే బృందం ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సొంత బలంతో గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తోంది. జేడీఎస్‌కు పట్టున్న పాత మైసూరులో పాగా వేయాలని చేరికలను ప్రోత్సహిస్తోంది.
చదవండి: నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి?
Comments
Please login to add a commentAdd a comment