సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది.
ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇందులో ఇద్దరు తెలంగాణ నాయకులకు అవకాశం లభించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌ను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే ఎనిమిది మంది రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకులుగా నియమించింది.
చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆమెకు చోటు!
కాగా, బుధవారం బెంగళూరులోని రాడిసన్ హోటల్‌లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్‌లుగా నియమించిన వారితో పాటు కర్ణాటక సరిహద్దు జిల్లాలకు చెందిన తెలంగాణ జిల్లాల నాయకత్వాన్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.
చదవండి: TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి
Comments
Please login to add a commentAdd a comment