No electricity
-
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
ఆ వంతెన మొత్తం అంధకారం
సాక్షి, బండిఆత్మకూరు(కర్నూలు) : మండల కేంద్రమైన బండిఆత్మకూరు బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే వంతెనపై అంధకారం అలుముకుంది. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో వంతెనపై ప్రయాణించడానికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పితే వంతెనపై నుంచి కిందికి పడితే ప్రాణాపాయం తప్పదని, అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దేశమంతా చీకటి.. ఇంటర్నెట్ కట్..
డమాస్కస్: తరచుగా ఉగ్రదాడులతో సతమతమయ్యే సిరియా తాజాగా మరో సమస్యను ఎదుర్కొంటుంది. ఆ దేశం గురువారం నాడు అంధకారంలో ఉండి పోయిందట. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారని ఓ అధికారిక ప్రకటనలో ఈ వివరాలను అధికారులు వెల్లడించారు. అన్ని గవర్నరేట్లలోనూ పవర్ కట్స్ ఉన్నాయని, ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా రద్దయ్యాయని వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ కారణాలు కనుక్కొవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎవరైనా కావాలని ప్లాన్ ప్రకారం చేశారా.. లేక సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తాయా అనే కోణాల్లో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్ : వెంకయ్యనాయుడు
హైదరాబాద్: ''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, గిట్టుబాటు ధర అని ఆయన చెప్పారు. త్వరలో వ్యవసాయ ఆదాయ బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దిగుమతులు తగ్గి ఉత్పత్తి పెరిగినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ** -
అంధకారంలో జోగిపేట
జోగిపేట, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీగా ఉన్న కాలం నాటి నుంచి ట్రాన్స్‌కో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం అవి రూ.2.50 కోట్లు మేర పేరుకుపోయాయి. గతంలోనే ట్రాన్స్‌కో అధికారులు సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైనా, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కలుగజేసుకుని సర్దిచెప్పడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జోగిపేట లోని వీధి దీపాలకు సంబంధించి నగర పంచాయతీ రూ.1.21 కోట్లు, పట్టణానికి సరఫరా చేసే తాగునీటి బోరుమోటార్ల బిల్లులకు సంబంధించి రూ.1.24 కోట్లు బకాయి ఉంది. ప్రతినెల తాగునీటి బోరుమోటార్, వీధి దీపాలకుగాను రూ.15 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయి. చాలా కాలంగా సర్కార్ నుంచి నిధులు రాకపోవడంతో నగర పంచాయతీ అధికారులు ఈ బిల్లులు చెల్లిం చడం లేదు. దీంతో తాజాగా ట్రాన్స్‌కో అధికారులు జోగిపేట, అందోల్ పట్టణాల్లో ఉన్న 32 బ టర్ఫ్లయి లైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రెండు పట్టణాల్లోనూ అంధకారం అలముకుంది. రూ. 30 లక్షలు చెల్లిస్తేనే సరఫరా ప్రస్తుతం నగర పంచాయితీ బకాయి పడి ఉన్న బకాయి బిల్లులో రూ.30 లక్షలు చెల్లిస్తే సరఫరా పునరుద్ధరిస్తాం. ఈ విషయం ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ దృష్టిలో కూడా ఉంది. నగర పంచాయతీ అధికారులు బిల్లు చెల్లింపు వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లే సరఫరా నిలిపివేశాం. - విజయ్‌కుమార్, ట్రాన్స్‌కో డీఈ పంచాయతీ కాలం నాటి బిల్లులవి ప్రస్తుతం ట్రాన్స్‌కో చెల్లించాల్సిన బకాయిలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీ కాలం నాటిది. అప్పటి బకాయి చెల్లించమంటే మాకేం సంబంధం. అయినప్పటికీ రూ.5 లక్షలు సోమవారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశాను. 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాగానే బకాయి చెల్లిస్తాను. -జి.విజయలక్ష్మి, కమిషనర్, జోగిపేట పంచాయతీ