
సాక్షి, బండిఆత్మకూరు(కర్నూలు) : మండల కేంద్రమైన బండిఆత్మకూరు బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే వంతెనపై అంధకారం అలుముకుంది. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో వంతెనపై ప్రయాణించడానికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పితే వంతెనపై నుంచి కిందికి పడితే ప్రాణాపాయం తప్పదని, అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment